Yamadheera Review : ‘యమధీర’ మూవీ రివ్యూ.. ఎన్నికల ముందు ఈవీఎం ట్యాపరింగ్ కథతో..
'యమధీర' సినిమా ఎన్నికల ముందు ఈవీఎం ట్యాపరింగ్ అంశంతో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్‌లా వచ్చింది

Komal Kumar Cricketer Sreesanth Yamadheera Movie Review and Rating
Yamadheera Review : కన్నడ స్టార్ కోమల్ కుమార్, క్రికెటర్ శ్రీశాంత్, రిషీక శర్మ, నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్.. పలువురు ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘యమధీర’. 2019లో కన్నడలో వచ్చిన ‘కెంపేగౌడ 2’ సినిమా అక్కడ భారీ విజయం సాధించగా ఇప్పుడు తెలుగులో నేడు మార్చి 23న థియేటర్స్ లో విడుదల అయింది. ఆర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా తెలుగులో శ్రీ మందిరం ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత వేదాల శ్రీనివాస్ రావు రిలీజ్ చేశారు.
కథ విషయానికొస్తే.. కెపి గౌతమ్(కోమల్ కుమార్) ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తన నిజాయితితో రెగ్యులర్ గా ట్రాన్స్ఫర్లు అవుతూ వైజాగ్ కమిషనర్ గా వస్తాడు. వైజాగ్ లో ఒక యువకుడి డెత్ కేస్ రీ ఓపెన్ చేసి పరిష్కరించే క్రమంలో అజర్ బైజాన్ దేశంలో ఉన్న దేశముఖ్ (క్రికెటర్ శ్రీశాంత్) ఆ యువకుడిని చంపించాడు అని తెలుసుకుంటాడు. అదే సమయంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి దేశముఖ్ సీఎం అవుతాడు. దీంతో పోలీసాఫీసర్ కెపి గౌతమ్ ఏం చేసాడు? ఆ మర్డర్ ఎందుకు చేశారు? ఆ యువకుడు ఎవరు? కెపి గౌతమ్ ఈ కేసుని సాల్వ్ చేశాడా? ముఖ్యమంత్రిని ఎలా ఎదుర్కున్నాడు? కెపి గౌతమ్ కి పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేసిందా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. కమర్షియల్ కోణంలో ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామాని చూపించారు. సిన్సియర్ పోలీసాఫీసర్ వర్సెస్ రాజకీయ నాయకుడు అనే కథలు చాలా వచ్చినా దీంట్లో ఈవీఎం ట్యాపరింగ్ కాన్సెప్ట్ జతచేసి చూపించారు. అదనంగా మదర్ సెంటిమెంట్ ని కూడా జోడించారు. సినిమా అక్కడక్కడా సాగతీతగా అనిపిస్తుంది. విలన్ గా శ్రీశాంత్ మెప్పించినా ఆ పాత్రని ఇంకా ఎలివేట్ చేసి ఉండాల్సిందే. కామెడీ పర్వాలేదనిపిస్తుంది.
Also Read : Anurag Kashyap : ఇక నుంచి నన్ను కలిస్తే లక్షల్లో ఫీజ్ ఇవ్వాల్సిందే.. స్టార్ డైరెక్టర్ సంచలన పోస్ట్..
నటీనటులు.. కన్నడలో ఆల్రెడీ చాలా సినిమాలతో మెప్పించిన కోమల్ కుమార్ ఈ సినిమాలో ఒక మాస్ హీరోగా పోలీసాఫీసర్ పాత్రలో మెప్పించాడు. సెంటిమెంట్, యాక్షన్ సీక్వెన్స్ లలో బాగా నటించాడు. నెగిటివ్ రోల్ లో క్రికెటర్ శ్రీకాంత్ అదరగొట్టాడు అని చెప్పొచ్చు. నటి రిషిక శర్మ పర్వాలేదనిపించింది. మూగ వ్యక్తి పాత్రలో ఆలీ అక్కడక్కడా తన కామెడీతో నవ్వించాడు. నాగబాబు, మధుసూదన్ రావు, సత్య ప్రకాష్, పృథ్వీరాజ్.. మిగిలిన నటీనటులు ఓకే అనిపించారు.
సాంకేతిక అంశాలు.. డబ్బింగ్ సినిమా అయినా తెలుగు కమర్షియల్ సినిమాలపైనే అనిపిస్తుంది. డబ్బింగ్ సింక్ బాగానే కుదిరింది. నిర్మాత వేదాల శ్రీనివాసరావు కాంప్రమైజ్ అవ్వకుండా డబ్బింగ్ సినిమాని ఒరిజినల్ తెలుగు సినిమాలా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రోష్ మోహన్ కార్తీక్ సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. యాక్షన్, సెంటిమెంట్ సీన్స్ లో వరుణ్ ఉన్ని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా సెట్ అయింది. పాటలు మాత్రం యావరేజ్ అనిపిస్తాయి. కథ మాములు కమర్షియల్ సినిమా అయినా దానికి ఈవీఎం ట్యాపరింగ్ కాన్సెప్ట్ ని జత చేసి కథనం కొత్తగా రాసుకున్నారు. దర్శకుడిగా శంకర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ కూడా కమర్షియల్ సినిమాలకు తగ్గట్టు పవర్ ఫుల్ గా ఉన్నాయి.
మొత్తంగా ‘యమధీర’ సినిమా ఎన్నికల ముందు ఈవీఎం ట్యాపరింగ్ అంశంతో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్‌లా వచ్చింది. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.