Anurag Kashyap : ఇక నుంచి నన్ను కలిస్తే లక్షల్లో ఫీజ్ ఇవ్వాల్సిందే.. స్టార్ డైరెక్టర్ సంచలన పోస్ట్..

స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Anurag Kashyap : ఇక నుంచి నన్ను కలిస్తే లక్షల్లో ఫీజ్ ఇవ్వాల్సిందే.. స్టార్ డైరెక్టర్ సంచలన పోస్ట్..

Bollywood Star Director Anurag Kashyap Sensational Post in Social Media goes Viral

Updated On : March 23, 2024 / 4:35 PM IST

Anurag Kashyap : బాలీవుడ్ లో గ్యాంగ్స్ ఆఫ్ వస్పూర్, బాంబే టాకీస్, బాంబే వెల్వెట్, అగ్లీ, లస్ట్ స్టోరీస్.. లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆర్జీవీ శిష్యుడిగా బాలీవుడ్ లో రచయితగా కెరీర్ మొదలుపెట్టి అనంతరం డైరెక్టర్ గా, యాక్టర్ గా, నిర్మాతగా సినీ పరిశ్రమలో సక్సెస్ అయ్యాడు. రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నాడు అనురాగ్ కశ్యప్.

తాజాగా అనురాగ్ కశ్యప్ తన పోస్ట్ లో.. నేను కొత్తగా వచ్చే వాళ్లకి సహాయం చేద్దామనుకొని నా సమయాన్ని వృధా చేసుకుంటున్నాను. ఇక నుంచి క్రియేటివ్ జీనియస్ అనుకోని నన్ను కలవాలనుకునేవాళ్ళని నేను కలిసి టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఇక నుంచి ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే 10-15 నిమిషాలకు లక్ష రూపాయలు, అరగంటకు 2 లక్షలు, గంటకు 5 లక్షలు ఛార్జ్ చేస్తాను. కొంతమందిని కలిసి టైం వేస్ట్ చేసుకొని నేను అలిసిపోయాను. మీరు నిజంగా ఆ డబ్బు ఇవ్వగలను అనుకుంటేనే కలవాడనికి కాల్ చేయండి లేకపోతే దూరంగా ఉండండి. డబ్బు అడ్వాన్స్ గా కట్టాల్సిందే అని పోస్ట్ చేశారు.

Also Read : They Call Him OG : ఎన్నికల హడావిడిలో పవన్ కళ్యాణ్.. OG సినిమా వర్క్‌లో బిజీగా డైరెక్టర్..

అలాగే.. దీని ప్రకారం కాల్ చేయొద్దు, మెసేజ్ చేయొద్దు అని కాదు. నన్ను కలవడానికి టైం కావాలంటే మాత్రం డబ్బులు కట్టాల్సిందే. నేను చారిటి చెయ్యట్లేదు. షార్ట్ కట్స్ లో ఎదగాలి అనుకునే వాళ్ళకి నేను దూరంగా ఉంటాను. అని పోస్ట్ చేశారు. దీంతో అనురాగ్ కశ్యప్ చేసిన పోస్ట్ వైరల్ గా మారగా బాలీవుడ్ లో చర్చగా మారింది. అసలు అనురాగ్ కశ్యప్ ని ఈ రేంజ్ లో డెసిషన్ తీసుకునేలా ఇరిటేట్ చేసింది ఎవరు అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇక కొంతమంది అయితే ఇలా డబ్బులిచ్చి కలవమనడాన్ని విమర్శిస్తుంటే, మరికొంతమంది కొత్త బిజినెస్ ఐడియా అని సపోర్ట్ చేస్తున్నారు.