They Call Him OG : ఎన్నికల హడావిడిలో పవన్ కళ్యాణ్.. OG సినిమా వర్క్‌లో బిజీగా డైరెక్టర్..
పవన్ ప్రస్తుతం ఏ సినిమాకి డేట్స్ ఇచ్చే పనిలో లేదు. మళ్ళీ ఎన్నికలు అయ్యాకే పవన్ షూటింగ్స్ కి వస్తారు.

Pawan Kalyan OG Movie Director Sujeeth Busy with Movie work
They Call Him OG : పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎలక్షన్స్ దగ్గరపడటంతో మళ్ళీ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. చేతిలో ఉన్న మూడు సినిమాలని పక్కనపెట్టేశారు. అందులో OG సినిమా ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. సుజీత్(Sujeeth) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ డాన్ గా నటిస్తున్న మాస్ యాక్షన్ సినిమా They Call Him OG సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే ఇంకొన్ని యాక్షన్ పార్ట్స్ షూటింగ్ అవ్వాలి.
పవన్ ప్రస్తుతం ఏ సినిమాకి డేట్స్ ఇచ్చే పనిలో లేదు. మళ్ళీ ఎన్నికలు అయ్యాకే పవన్ షూటింగ్స్ కి వస్తారు. అయితే పవన్ లేకపోయినా సినిమాకి సంబంధించిన మిగాతా వర్క్ మొత్తం ఫినిష్ చేయాలని OG డైరెక్టర్ సుజీత్ కష్టపడుతున్నాడు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసాడు. డైరెక్టర్ సుజీత్, కెమెరామెన్ రవిచంద్రన్, మరొకరు కలిసి OG సినిమా యాక్షన్ సీన్స్ కోసం లొకేషన్స్ వెతుకుతున్నారు. సుజీత్ ఈ ఫోటోని షేర్ చేసి యాక్షన్ రెక్కీ అని తెలిపాడు.
దీంతో పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూట్ శరవేగంగా చేసేలా సుజీత్ అన్ని ముందే ప్లాన్ చేసుకుంటున్నాడని అభిమానులు అభినందిస్తున్నారు. ఇప్పటికే OG సినిమా నుంచి గ్లింప్స్ రిలీజవ్వగా ఆసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.