Konijeti Rosaiah pic released from Ram Gopal Varma Vyooham movie
Ram Gopal Varma Vyooham : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ అంశాలు పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఆ సినిమాని రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నాడు. మొదటి భాగానికి ‘వ్యూహం’, రెండో భాగానికి ‘శపథం’ అనే టైటిల్స్ ని అనౌన్స్ చేసిన వర్మ.. ఇటీవల ఫస్ట్ పార్ట్ వ్యూహం షూటింగ్ కూడా మొదలు పెట్టేశాడు. ఇక ఆ సినిమా నుంచి ఏదొక అప్డేట్ ఇస్తూ ప్రేక్షకుల్లో మూవీ పై ఆసక్తి కలిగేలా చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాలోని సీఎం జగన్ (YS Jagan Mohan Reddy), ఆయన సతీమణి వైఎస్ భారతి (Y S Bharati) పాత్రలు పరిచయం చేస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేయగా అవి నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా ఇప్పుడు మరో ఫోటోని షేర్ చేశాడు. ఆ ఫొటోలో జగన్ తో పాటు పలు పాత్రలు కనిపిస్తున్నాయి. వాటిలో ఒక పాత్ర మాజీ ముఖ్యమంత్రి రోశయ్యది (Konijeti Rosaiah) అని తెలుస్తుంది. మరో పాత్ర ఇప్పటి మినిస్టర్ రోజా అని కొందరు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరో పాత్రని చూసి.. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణస్నేహితుడు కేవీపీ రామచంద్ర రావు అని అంటున్నారు. ఆ పాత్రలను ఒకసారి మీరు కూడా చూసి ఎవరో పట్టడానికి ట్రై చేయండి.
Megha Akash: పీకల్లోతు ప్రేమలో మేఘా ఆకాశ్.. త్వరలోనే పెళ్లి..? వరుడు అతడేనంట..?
కాగా ఈ సినిమాలో జగన్ పాత్రని చేసిన అజ్మల్ అమీర్ (Ajmal Ameer) పోషిస్తున్నాడు. గతంలో వర్మ తెరకెక్కించిన లక్ష్మిస్ ఎన్టీఆర్ లో కూడా అమీర్ కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక వైఎస్ భారతి పాత్రలో మానస రాధా కృషన్ కనిపిస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన వీరిద్దరి లుక్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. వర్మతో వంగవీటి సినిమాని నిర్మించిన దాసరి కిరణ్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు.
Konijeti Rosaiah pic released from Ram Gopal Varma Vyooham movie