Korean soprano singer Lee Sang Eun : ప్రదర్శనకు టైమ్ అవుతున్నా.. స్టేజ్ పైకి రాని సింగర్.. బాత్రూమ్లో కనిపించిన దృశ్యం చూసి అంతా షాక్
తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకోవాల్సిన సింగర్ స్టేజీ పైకి రాలేదు. ప్రేక్షకులు అందరూ వచ్చారు. దీంతో ఈవెంట్ సిబ్బందిలో కంగారు మొదలైంది. సింగర్ ప్రదర్శన ఇచ్చే హాల్ వద్దకు ఎప్పుడో వచ్చింది. స్టేజీ పైకి ఎందుకు రావడం లేదని సిబ్బంది అంతా కలిసి వెతకడం ప్రారంభించారు.
![Korean soprano singer Lee Sang Eun : ప్రదర్శనకు టైమ్ అవుతున్నా.. స్టేజ్ పైకి రాని సింగర్.. బాత్రూమ్లో కనిపించిన దృశ్యం చూసి అంతా షాక్ Korean soprano singer Lee Sang Eun : ప్రదర్శనకు టైమ్ అవుతున్నా.. స్టేజ్ పైకి రాని సింగర్.. బాత్రూమ్లో కనిపించిన దృశ్యం చూసి అంతా షాక్](https://10tv.in/wp-content/uploads/2023/07/Lee-Sang-Eun-1.jpg)
Lee Sang Eun
Soprano singer Lee Sang Eun : మరికాసేపట్లో తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకోవాల్సిన సింగర్ స్టేజీ పైకి రాలేదు. ప్రేక్షకులు అందరూ వచ్చారు. దీంతో ఈవెంట్ సిబ్బందిలో కంగారు మొదలైంది. సింగర్ ప్రదర్శన ఇచ్చే హాల్ వద్దకు ఎప్పుడో వచ్చింది. అయినప్పటికి ఆమె స్టేజీ పైకి ఎందుకు రావడం లేదని సిబ్బంది అంతా కలిసి వెతకడం ప్రారంభించారు. అయితే.. వాష్‌రూమ్‌లో కనిపించిన దృశ్యం చూసి అంతా షాకైయ్యారు. ప్రముఖ కొరియన్ సింగర్ లీ సాంగ్ యున్ (Lee Sang Eun)బాత్రూమ్లో శవమై కనిపించింది.
Mokpo మున్సిపల్ కోయిర్ సహకారంతో నిర్వహించబడిన Gimcheon మున్సిపల్ కోయిర్ యొక్క 33వ రెగ్యులర్ కాన్సర్ట్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు సింగర్ లీ సాంగ్ యున్ ను ఆహ్వానించారు. గ్రాండ్ హాల్ ఆఫ్ గిమ్‌చియాన్ కల్చర్ అండ్ ఆర్ట్ సెంటర్లో ఆమె ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. సమయం దగ్గర పడింది. అయినప్పటికి ఆమె స్టేజీ వద్దకు చేరుకోలేదు. దీంతో సిబ్బందిలో కంగారు మొదలైంది. వెంటనే ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు.
జూలై 6 రాత్రి 8:23 గంటల సమయంలో మూడవ అంతస్తులోని మహిళల వాష్‌రూమ్‌లో నిర్జీవంగా కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె ఎలా మరణించింది అనే విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు అక్కడి పోలీసులు. 46 ఏళ్ల లీ సాంగ్ యున్ ప్రదర్శన ఇవ్వడానికి ముందే మరణించడండంతో ప్రతి ఒక్కరు శోకసంద్రంలో మునిగిపోయారు.
లీ సాంగ్ యున్ ప్రతిభావంతులైన సోప్రానో గాయకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సియోల్ నేషనల్ యూనివర్శిటీ నుండి పట్టభద్రులైన ఆమె న్యూయార్క్‌లోని మన్నెస్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ నుండి మాస్టర్స్ డిగ్రీని పొందారు.