BiggBoss Kaushal : షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం మానేయ‌కే కరోనా తెచ్చుకున్నాను

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ కి కరోనా సోకింది. ఈ విషయంపై తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. '' అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నాకు కరోనా సోకింది. ప్రస్తుతం ఇంట్లోనే.........

BiggBoss Kaushal : షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం మానేయ‌కే కరోనా తెచ్చుకున్నాను

Koushal

BiggBoss Kaushal :   ఇటీవల రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్ తో సహా అన్ని సినీ పరిశ్రమలలో సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. కరోనా థర్డ్ వేవ్ ఎవ్వర్నీ వదలట్లేదు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మండా కరోనా బారిన పడ్డారు.

Sarayu : కరోనా బారిన‌పడిన బిగ్‌బాస్ సరయు

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ కి కరోనా సోకింది. ఈ విషయంపై తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ” అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నాకు కరోనా సోకింది. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండి మందులు వాడుతున్నాను. ఇటీవల ఫ్యాషన్ వాక్స్ లో, ఈవెంట్స్ లో, షూట్స్ లో నన్ను కలిసిన వారంతా టెస్ట్ చేయించుకోండి. గుంపులుగా గుమిగూడ‌కండి. వ్యాక్సిన్ వేయించుకోండి, మాస్కులు ధ‌రించండి. క‌ర‌చాల‌నం, సెల్ఫీలు మానేయండి. నేను షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం మానేయ‌కే ఈ ప‌రిస్థితి తెచ్చుకున్నాను” అని పోస్ట్ చేశారు కౌశల్.