హరిహర వీరమల్లు ప్రాజెక్టు నుంచి తాను బయటకు రావడంపై కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసిన దర్శకుడు క్రిష్..
ఆ సినిమా తాను కొంతభాగం చిత్రీకరించానని, పవన్ కల్యాణ్ అంటే తనకు ఇష్టమని తెలిపారు.

Krish Jagarlamudi
Hari Hara Veera Mallu: ‘ఘాటి’ సినిమా సెప్టెంబరు 5న విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఇవాళ మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’ ప్రాజెక్టు నుంచి ఎందుకు బయటకు వచ్చారో చెప్పారు.
ఆ సినిమా తాను కొంతభాగం చిత్రీకరించానని, పవన్ కల్యాణ్ అంటే తనకు ఇష్టమని తెలిపారు. అలాగే, ఆ సిని నిర్మాత ఏఎం రత్నంపై గౌరవం ఉందని, ఆయన సినిమాల పోస్టర్ల నుంచి స్ఫూర్తిని పొందానని చెప్పారు. (Krish Jagarlamudi)
కరోనాతో పాటు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ మూవీ షూటింగ్ షెడ్యూళ్లలో మార్పులు వచ్చాయని తెలిపారు. అందుకే తాను ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చానని చెప్పారు. అనంతరం ‘హరిహర వీరమల్లు’ ప్రాజెక్టును జ్యోతికృష్ణకు అప్పగించారని తెలిపారు.
Also Read: త్రిశూల వ్యూహాన్ని తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచి మొదలుపెట్టిన పవన్
‘హరిహర వీరమల్లు’ సినిమాలో పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించారు. బాబీ డీయోల్, నిధి అగర్వాల్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా తెలుగు సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలైంది.
ఈ ప్రాజెక్ట్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకంగా చిత్రంగా భావించారు. చారిత్రక నేపథ్యం, గ్రాండ్ విజువల్స్‌తో ప్రేక్షకులకు వినూత్నమైన అనుభూతి కలిగించేలా ఈ చిత్రం రూపుదిద్దుకుంది.