రానా సమర్పణలో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’
‘గుంటూరు టాకీస్’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, ‘క్షణం’ ఫేమ్ రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ టైటిల్ లుక్ రిలీజ్..

‘గుంటూరు టాకీస్’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, ‘క్షణం’ ఫేమ్ రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ టైటిల్ లుక్ రిలీజ్..
రానా దగ్గుబాటి సమర్పణలో, సురేష్ ప్రొడక్షన్స్ సహా వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, సంజయ్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతోన్న సినిమా.. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. ఈ సినిమా టైటిల్ లుక్‌ను రానా దగ్గుబాటి తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
‘క్షణం’ సినిమాతో ఆకట్టుకున్న రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ‘గుంటూరు టాకీస్’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించాడు. శ్రద్ధా శ్రీనాధ్, శీరత్ కపూర్, శాలిని వడ్ని హీరోయిన్స్‌గా నటించారు.
నిజంగా వచ్చిన రూమర్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబర్ 11న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. మూడేళ్ల తర్వాత రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Here it is!! #KrishnaAndhisLeela @ravikanthperepu@siddhu95229008#shalinivadnikatti @shraddhasrinath@iamseeratkapoor More Soon!! pic.twitter.com/hqKC9jHm7w
— Rana Daggubati (@RanaDaggubati) December 9, 2019