Krishnam Raju: కృష్ణంరాజు ఎలా చనిపోవాలని కోరుకున్నారో మీకు తెలుసా..?
టాలీవుడ్ రెబల్ స్టార్, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూయడంతో యావత్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విషాదంలోకి వెళ్లిపోయింది. ఇక కృష్ణంరాజును కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్తున్నారు. కృష్ణంరాజు తన చావు ఎలా ఉండాలనే విషయంపై గతంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన పాత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Krishnam Raju Wished To Die Like This
Krishnam Raju: టాలీవుడ్ రెబల్ స్టార్, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూయడంతో యావత్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విషాదంలోకి వెళ్లిపోయింది. ఇక కృష్ణంరాజును కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్తున్నారు. కృష్ణంరాజు మృతి సినీ రంగానికి తీరని లోటని ఈ సందర్భంగా పలువురు ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు. అయితే కృష్ణంరాజు తన చావు ఎలా ఉండాలనే విషయంపై గతంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన పాత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
16 ఏళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు మాట్లాడుతూ.. పచ్చని చెట్టు నీడలో కూర్చుని, తన జీవితంలో ఎవరికీ అన్యాయం చేయలేదని, గుండెలపై చేతులు వేసుకుని, నిర్మలమైన ఆకాశం వంక చూస్తూ, తుదిశ్వాస విడవాలనేది తన కోరిక.. అంటూ కృష్ణం రాజు చెప్పిన మాటలు అభిమానుల కళ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి. దీన్ని బట్టి ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థంచేసుకోవచ్చని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఆయన తన జీవితంలో ఎవరికీ ఎలాంటి కష్టాన్ని కలిగించకుండా, చాలా హుందాగా బతికారంటూ కృష్ణంరాజు అభిమానులు చెబుతున్నారు. ఇక తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని క్రియేట్ చేసుకుని, ఫ్యామిలీ హీరోగా కృష్ణంరాజు ఎనలేని అభిమానాన్ని సాధించారు.
కాగా కృష్ణంరాజు అంత్యక్రియలు నేటి మధ్యాహ్నం మోయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్‌హౌస్‌లో నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఏదేమైనా కృష్ణంరాజు తెలుగు సినిమా రంగంలో ‘రారాజు’గా చిరస్థాయిగా మిగిలిపోతారని ఆయన అభిమానులు శోకతప్త హృదయంతో ఆయన్ను గుర్తుకు చేసుకుంటున్నారు.