Koffee with Karan : మీరే నన్ను రిజెక్ట్ చేశారు.. కరణ్ కి కౌంటర్ ఇచ్చిన కృతిసనన్..

తాజాగా కాఫీ విత్ కరణ్ షోకి గెస్టులుగా కృతి సనన్, టైగర్ ష్రాఫ్ జంటగా వెళ్లారు. ఇటీవలే ఈ ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోలో కూడా ఎప్పటిలాగే లవ్, డేటింగ్ ప్రశ్నలు అడిగాడు కరణ్. అయితే కృతి సనన్ ని నువ్వెప్పుడైనా ఆడిషన్ కి వెళ్ళావా? నిన్ను ఎవరైనా రిజెక్ట్ చేశారా అని............

krithi sanan counter to karan johar

Koffee with Karan :  బాలీవుడ్ సూపర్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ప్రస్తుతం ఏడో సీజన్ నడుస్తుంది. ఎప్పటిలాగే కరణ్ తన పిచ్చి పిచ్చి ప్రశ్నలతో వచ్చే గెస్టులని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ సారి పర్సనల్ ప్రశ్నలు కూడా ఎక్కువే అడుగుతున్నాడు. వచ్చే గెస్టులు ఎలా ఫీల్ అవుతారు అని లేకుండా ఎలా పడితే అలా ప్రశ్నలు అడుగుతాడు కరణ్ జోహార్. అయితే కొంతమంది మాత్రం కరణ్ కి ఇండైరెక్ట్ గా కౌంటర్లు ఇస్తారు. ఇటీవల కరీనా కపూర్, అమీర్ ఖాన్ కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ అడిగిన ప్రశ్నలకి డైరెక్ట్ గానే కౌంటర్ ఇచ్చారు. ఇక తాప్సి అయితే ఈ షోకి వెళ్లకుండానే కరణ్ కి కౌంటర్ ఇచ్చింది.

తాజాగా కాఫీ విత్ కరణ్ షోకి గెస్టులుగా కృతి సనన్, టైగర్ ష్రాఫ్ జంటగా వెళ్లారు. ఇటీవలే ఈ ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోలో కూడా ఎప్పటిలాగే లవ్, డేటింగ్ ప్రశ్నలు అడిగాడు కరణ్. అయితే కృతి సనన్ ని నువ్వెప్పుడైనా ఆడిషన్ కి వెళ్ళావా? నిన్ను ఎవరైనా రిజెక్ట్ చేశారా అని అడిగాడు. దీనికి కృతి సనన్ సమాధానమిస్తూ.. ”నన్ను రిజెక్ట్ చేసింది మీరే. నేను మొదట ఆడిషన్‌కు వెళ్లిన సినిమా ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ -1’. ఆ సినిమాకి డైరెక్టర్ మీరే. నాకు అవకాశం ఇవ్వలేదు” అని తెలిపింది. దీంతో కరణ్ కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.

Vijay Sethupathi : షారుఖ్ కి విలన్ గా విజయ్ సేతుపతి.. ఏకంగా 20 కోట్ల రెమ్యునరేషన్.. ఈ సారి బాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే..

ఇండైరెక్ట్ గా మీరే నాకు ఛాన్స్ ఇవ్వలేదు, ఇప్పుడేమో ఇలా పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు అని కరణ్ కి కౌంటర్ పడిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.