Prabhas : కాఫీ విత్ కరణ్ షోలో ప్రభాస్ కి కాల్ చేసిన కృతి సనన్.. హే బాహుబలి అంటూ కరణ్ హడావిడి..

ఈ ఎపిసోడ్ లో టైగర్ ష్రాఫ్, కృతి సనన్ పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు. అయితే ఇందులో ఒక గేమ్ పెట్టాడు కరణ్. ఎవరైనా సెలబ్రిటికి కాల్ చేయాలని వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తే మీకు రెండు పాయింట్స్ వస్తాయని చెప్పాడు. దీంతో వెంటనే కృతి సనన్ మన బాహుబలి ప్రభాస్ కి.............

Prabhas : కాఫీ విత్ కరణ్ షోలో ప్రభాస్ కి కాల్ చేసిన కృతి సనన్.. హే బాహుబలి అంటూ కరణ్ హడావిడి..

Krithi Sanon Call to Prabhas in Koffee with Karan Show

Updated On : September 2, 2022 / 12:54 PM IST

Prabhas :  బాలీవుడ్ సూపర్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ప్రస్తుతం ఏడో సీజన్ నడుస్తుంది. ఎప్పటిలాగే కరణ్ తన పిచ్చి పిచ్చి ప్రశ్నలతో, పర్సనల్ ప్రశ్నలతో వచ్చే గెస్టులు ఎలా ఫీల్ అవుతారు అని లేకుండా ఎలా పడితే అలా ప్రశ్నలు అడిగేస్తున్నాడు. దీంతో ఇటీవల కరణ్ ని ఇవేం ప్రశ్నలు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఎపిసోడ్ లో కాఫీ విత్ కరణ్ షోకి గెస్టులుగా కృతి సనన్, టైగర్ ష్రాఫ్ జంటగా వెళ్లారు. ఇటీవలే ఈ ఎపిసోడ్ రిలీజ్ అయింది.

ఈ ఎపిసోడ్ లో టైగర్ ష్రాఫ్, కృతి సనన్ పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు. అయితే ఇందులో ఒక గేమ్ పెట్టాడు కరణ్. ఎవరైనా సెలబ్రిటికి కాల్ చేయాలని వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తే మీకు రెండు పాయింట్స్ వస్తాయని చెప్పాడు. దీంతో వెంటనే కృతి సనన్ మన బాహుబలి ప్రభాస్ కి కాల్ చేసింది. ప్రభాస్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. దీంతో కృతి.. హాయ్ ప్రభాస్ నేను కరణ్ షోలో ఉన్నాను అంటే హాయ్ చెప్పాడు ప్రభాస్. ఇక కరణ్ ఫోన్ దగ్గరకి వచ్చి.. హాయ్ ప్రభాస్ ఓన్లీ బాహుబలి ఇట్స్ మీ కరణ్ అని హడావిడి చేశాడు. ప్రభాస్ కూడా ఇట్స్ మీ ప్రభాస్ అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చాడు. ఇక కృతి.. ఓకే థ్యాంక్స్ ప్రభాస్ ఫోన్ లిఫ్ట్ చేసినందుకు తర్వాత కాల్ చేస్తాను మళ్ళీ అని కాల్ కట్ చేసింది. అటు టైగర్ ష్రాఫ్ ఎవరికీ కాల్ చేశాడో తెలీదు కానీ వాళ్ళు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేదు.

Pawan Kalyan: నమ్మిన సిద్ధాంతం కోసం శ్రమించే నా తమ్ముడు.. పవర్‌స్టార్‌కి మెగాస్టార్ విషెస్

దీంతో ఈ వీడియో బైట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కృతి సనన్, ప్రభాస్ కలిసి ఆదిపురుష్ లో నటించారు. కృతి ఇలా డైరెక్ట్ కాల్ చేయడం, కరణ్ బాహుబలి అంటూ పొగిడేయడంతో మన టాలీవుడ్, ప్రభాస్ డామినేషన్ క్లియర్ గా కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియో చూసి అదీ ప్రభాస్ రేంజ్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.