Krithi Shetty: మరో తమిళ స్టార్ హీరోతో సినిమాకు సై అంటోన్న కృతి

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి శెట్టి హీరో కార్తీ నటించే సినిమాలో హీరోయిన్‌గా ఓకే అయినట్లుగా కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Krithi Shetty: మరో తమిళ స్టార్ హీరోతో సినిమాకు సై అంటోన్న కృతి

Krithi Shetty To Star Opposite Karthi

Updated On : April 12, 2023 / 8:44 PM IST

Krithi Shetty: ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి శెట్టి, ఆ సినిమాతో ప్రేక్షకుల్లో సాలిడ్ క్రేజ్‌ను క్రియేట్ చేసుకుంది. సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో కృతి శెట్టి పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది ఈ బ్యూటీ.

Krithi Shetty : ‘కస్టడీ’లో రేవతి.. సక్సెస్ అవ్వాల్సిందే..

తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చేందుకు ఏకంగా స్టార్ హీరో సూర్య సరసన నటించేందుకు రెడీ అయ్యింది ఈ బ్యూటీ. సూర్య కెరీర్‌లో 41వ సినిమాగా స్టార్ట్ అయిన మూవీలో కృతి శెట్టి హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యింది. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి సూర్య వాకౌట్ చేశాడు. ఆ తరువాత కృతి స్థానంలోనూ వేరొక తమిళ హీరోయిన్ వచ్చి చేరింది. దీంతో కృతి శెట్టి కోలీవుడ్ ఎంట్రీ అలాగే ఉండిపోయింది. కాగా, ఇప్పుడు మరో స్టార్ హీరో సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈ బేబమ్మ.

Krithi Shetty : సైలెంట్‌గా హైదరాబాద్‌లో ఫ్యాన్స్ మీట్ పెట్టిన కృతిశెట్టి.. వైరల్ అవుతున్న సెల్ఫీ..

సూర్య తమ్ముడు హీరో కార్తీ నటించే సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి ఓకే అయినట్లుగా కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నాలన్ కుమారస్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో కృతి శెట్టి పాత్ర ఎలా ఉండబోతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలుగులో నాగచైతన్య సరసన కస్టడీ మూవీలో నటిస్తోంది ఈ బ్యూటీ.