Adipurush Trailer : ఆదిపురుష్ ట్రైలర్ స్పెషల్ స్క్రీనింగ్.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన కృతి సనన్!
హైదరాబాద్ AMB మాల్ లో ఆదిపురుష్ ట్రైలర్ స్పెషల్ స్క్రీనింగ్. హైదరాబాద్ లో ల్యాండ్ అయిన హీరోయిన్ కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్.

Kriti Sanon Om Raut attended Adipurush Trailer special screening in AMB mall
Adipurush Trailer : ప్రభాస్ (Prabhas), కృతిసనన్ (Kriti Sanon) కలిసి నటిస్తున్న మైథిలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’. రామాయణం కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్ నటిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రేపు (మే 9) సాయంత్రం 5:04 నిమిషాలకు ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. మొత్తం 70 దేశాల్లో ఈ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు. 3D ట్రైలర్ ని స్పెషల్ గా థియేటర్స్ లో స్క్రీనింగ్ చేయనున్నారు.
Adipurush : జై శ్రీరామ్.. ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏకంగా 70 దేశాల్లో ట్రైలర్ రిలీజ్..
అయితే ఒక రోజు ముందే ఈ ట్రైలర్ ని కొంతమంది అభిమానులకు, మీడియా వర్గాలకు హైదరాబాద్ AMB మాల్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు. ఈ స్క్రీనింగ్ కి హాజరయ్యేందుకు కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఇక ఈ ట్రైలర్ ని చూసేందుకు AMB మాల్ కి చేరుకున్న ప్రభాస్ అభిమానులు సందడి చేస్తున్నారు. గతంలో రిలీజ్ అయిన టీజర్ గ్రాఫిక్స్ విషయంలో భారీ ట్రోలింగ్ కి గురైంది. దీంతో VFX వర్క్స్ ని మెరుగు పరుచుకునేందుకు వెనక్కి వెళ్లి వెళ్లిన సంగతి తెలిసిందే.
Adipurush : ఆదిపురుష్ కోసం రూట్ క్లియర్ చేస్తున్న మేకర్స్.. హిందీ సినిమాలను కూడా పోస్ట్‌పోన్..
ఆ తరువాత మూవీ నుంచి కొన్ని పోస్టర్స్ తప్ప మరో టీజర్ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుతుండడంతో గ్రాఫిక్స్ వర్క్ లో ఏమన్నా చేంజ్స్ జరిగాయా? లేదా? అని తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈరోజు స్క్రీనింగ్ తో మూవీ గ్రాఫిక్స్ పై ఆడియన్స్ కి ఒక అంచనా రానుంది. దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.