‘సామజవరగమన’ నాకు తోడుగా నిలిచింది – కేటీఆర్ ప్రశంస : స్పందించిన థమన్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మినిస్టర్ కేటీఆర్ తనను ఓ సినిమా పాట మైమరపించిందని ట్వీట్ చేశారు..

  • Published By: sekhar ,Published On : January 21, 2020 / 08:10 AM IST
‘సామజవరగమన’ నాకు తోడుగా నిలిచింది – కేటీఆర్ ప్రశంస : స్పందించిన థమన్

Updated On : January 21, 2020 / 8:10 AM IST

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మినిస్టర్ కేటీఆర్ తనను ఓ సినిమా పాట మైమరపించిందని ట్వీట్ చేశారు..

క్షణం తీరిక లేకుండా రాజకీయాలతో బిజీ బిజీగా ఉండే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మినిస్టర్ కేటీఆర్ తాజాగా ఓ సినిమా పాట తనను మైమరపించిందని ట్వీట్ చేయడం విశేషం. ఇంతకీ కేటీఆర్‌ను అంతగా అలరించిన పాట ఏంటో తెలుసా? ‘సామజవరగమన’.. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో.. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘అల… వైకుంఠపురములో’.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై పాజిటివ్ టాక్, హౌస్ ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద విజయ విహారం చేస్తోంది. 

Read Also : తెలుగులో ఫట్ – హిందీలో హిట్!

ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ పర్యటనలో ఉన్న ఆయన తనను మైమరపింపజేసిన సామజవరగమన.. పాటను ప్రశంసిస్తూ మంగళవారం ఉదయం ట్వీట్‌ చేశారు. ‘విమానం కాస్త ఆలస్యమైంది. అప్పుడు స్విట్జర్లాండ్‌లో ఉదయం 3.30 అవుతోంది. ఆ సమయంలో సామజవరగమన పాట విన్నాను. నాకు తోడుగా నిలిచిన ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది. వెంటనే నా ప్లే లిస్ట్‌లో చేరిపోయింది. థమన్‌.. ఈ సాంగ్‌తో మిమ్మల్ని మీరే  మించిపోయారు’ అని పేర్కొన్నారు.

కేటీఆర్ ట్వీట్‌కి థమన్ స్పందిస్తూ.. ‘మీ నుంచి ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉంది.. మీ వల్ల సామజవరగమన పాట మరింత సెన్సేషనల్‌ అవుతుంది సర్’ అని ట్వీట్‌ చేశాడు.
విజయవంతంగా రెండో వారంలోకి ఎంటర్ అయిన ‘అల వైకుంఠపురములో’ 3 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేసి యూఎస్‌లోనూ సత్తా చాటుతూ.. అక్కడ మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ లైఫ్ టైమ్ రికార్డును తుడిచేయడం విశేషం..