రియల్ లైఫ్‌కు దగ్గరగా నా ఫ్రెండ్ మంచి సినిమా తీశాడు – కేటీఆర్
తెలంగాణా ఐటీ మినిస్టర్ కేటీఆర్ ‘ప్రెషర్ కుక్కర్’ సినిమా చూసి, మూవీ టీమ్‌ను విష్ చేశారు..

తెలంగాణా ఐటీ మినిస్టర్ కేటీఆర్ ‘ప్రెషర్ కుక్కర్’ సినిమా చూసి, మూవీ టీమ్‌ను విష్ చేశారు..
తెలంగాణా ఐటీ మినిస్టర్ కేటీఆర్ ‘ప్రెషర్ కుక్కర్’ సినిమా చూసి, చిత్రబృందాన్ని అభినందించారు. సినిమా సహజత్వానికి దగ్గరగా ఉందని ఆయన అన్నారు. సాయి రోనక్, ప్రీతి అష్రాని జంటగా సుజోయ్ అండ్ సుషీల్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ.. ‘ప్రెషర్ కుక్కర్’.. (ప్రతి ఇంట్ల ఇదే లొల్లి)..
అభిషేక్ పిక్చర్స్ సమర్పణలో, కారంపూరి క్రియేషన్స్, మైక్ మూవీస్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రం మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా మంత్రి కేటీఆర్ ‘ప్రెషర్ కుక్కర్’ సినిమా చూశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ : ‘‘సుజోయ్ నాకు మంచి మిత్రుడు.. తెలంగాణ ఏర్పడిన తరువాత సుజయ్ బెంగళూర్‌లో వుంటే నేను కలసి పని చేద్దామని ఇక్కడకు రమ్మని చెప్పాను. లిమిటెడ్ బడ్జెట్‌తో అతను ఈ సినిమా చేశాడు.
సినిమా ఫ్రెష్ ఎనర్జీతో మెసేజ్‌తో మంచిగా వుంది. డాలర్ డ్రీమ్స్ కోసం అందరూ అమెరికా పరుగులు పెడుతున్నారు.. కథలోని కంటెంట్‌ను అందరకీ అర్థం అయ్యేలా సినిమా తీశారు. సహజత్వానికి చాలా దగ్గరగా వుంది సినిమా. హీరో హీరోయిన్స్ బాగా చేశారు. మ్యూజిక్ బాగుంది.. అందరూ ‘ప్రెషర్ కుక్కర్’ సినిమా చూడండి’’ అన్నారు.