Kushi fifth Single Osi Pellama : స‌మంత వ‌ల్ల ఎన్ని ఇబ్బందులు ప‌డ్డాడో చెబుతున్న విజ‌య్‌.. ఖుషి నుంచి ఐదో సాంగ్ వ‌చ్చేసింది

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం ఖుషి (Kushi). శివ నిర్వాణ (Shiva Nirvana) ద‌ర్శ‌క‌త్వంలో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటుంది.

Kushi fifth Single Osi Pellama : స‌మంత వ‌ల్ల ఎన్ని ఇబ్బందులు ప‌డ్డాడో చెబుతున్న విజ‌య్‌.. ఖుషి నుంచి ఐదో సాంగ్ వ‌చ్చేసింది

Kushi fifth Single

Updated On : August 26, 2023 / 5:05 PM IST

Kushi fifth Single : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం ఖుషి (Kushi). శివ నిర్వాణ (Shiva Nirvana) ద‌ర్శ‌క‌త్వంలో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాకు అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందిస్తుండ‌గా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 1న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో జోరు పెంచింది.

Arjun – Malaika : బాలీవుడ్ హాట్ కపుల్ బ్రేకప్ చెప్పుకున్నారా?

ఇప్ప‌టికే టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. నాలుగు పాట‌ల‌ను రిలీజ్ చేయ‌గా పాపుల‌ర్ అయ్యాయి. నిన్న‌ ఐదో సాంగ్ ప్రొమోను రాగా నేడు పూర్తి సాంగ్ వ‌చ్చేసింది. “కశ్మీరులో ఫ‌స్ట్ టైం త‌న‌ను చూసినా.. ముందు వెన‌క చూడ‌కుండా మ‌న‌సిచ్చినా, బాబు మాట ప‌క్క‌నెట్టి బ‌య‌ట‌కు వ‌చ్చినా, ల‌గ్న‌మెట్టి కాపురాన్ని స్టార్ చేసినా.. స్ట్ర‌గుల్ స్టార్ అయ్యేనే, పాప చేంజ్ అయ్యేనే.. ఓసి పెళ్లామా..” అంటూ పాట సాగుతోంది. ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ఈ పాట‌కు లిరిక్స్ రాయ‌గా రాహుల్ సిప్లిగంజ్ పాడాడు.

Jailer records : ఆగ‌ని జైల‌ర్ రికార్డులు.. ఐదు రాష్ట్రాల్లో ఆ ఘ‌న‌త సాధించిన తొలి సినిమాగా..!

జయరామ్, సచిన్ ఖేడకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ లు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇటీవ‌లే ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. యు/ఏ(U/A) స‌ర్టిఫికేట్ ను సెన్సార్ బృందం ఇచ్చింది. ర‌న్‌టైమ్ 2 గంట‌ల 45నిమిషాలు. లైగ‌ర్ ప్లాప్ త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై విజ‌య్ భారీ ఆశ‌లే పెట్టుకున్నాడు.

Thalaivar 170 : రజినీకాంత్, అమితాబ్ సినిమాలో శర్వానంద్.. సూపర్ ఛాన్స్ కొట్టేశాడుగా..