Big Boss 5: లహరి ఎలిమినేషన్.. కారణాలివేనా?

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ లో మూడవ వారం కూడా ముగిసింది. ప్రతి సండే అంటూనే ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తున్నాడు హోస్ట్ నాగ్. 19 మందితో మొదలైన ఈ సీజన్ లో..

Big Boss 5: లహరి ఎలిమినేషన్.. కారణాలివేనా?

Big Boss 5

Updated On : September 27, 2021 / 8:10 AM IST

Big Boss 5: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ లో మూడవ వారం కూడా ముగిసింది. ప్రతి సండే అంటూనే ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తున్నాడు హోస్ట్ నాగ్. 19 మందితో మొదలైన ఈ సీజన్ లో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేషన్ జరిగిపోయింది. సోషల్ మీడియా, నెటిజన్లు, ప్రేక్షకులు ఊహించినట్లుగానే లహరి ఈ వారం హౌస్ నుండి బయటకి వచ్చేసింది. ఆదివారం ఎపిసోడ్ లో నాగ్‌ కంటెస్టెంట్లతో అంత్యాక్షరితో మొదలుపెట్టి డ్యాన్స్‌ను జత చేయడంతో హౌస్‌మేట్స్‌ విజృంభించారు. చివరిగా లహరిని బయటకి పంపేశాడు. యదృచ్ఛకమో లేక కావాలనే చేశారో కానీ.. మూడవ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లిన లహరి మూడవ వారమే ఎలిమినేట్ అయింది.

Big Boss 5: ముగిసిన లహరి జర్నీ.. వెక్కి వెక్కి ఏడ్చిన శ్వేతా!

మూడో వారం నామినేషన్స్‌లో ప్రియ, లహరి, మానస్, ప్రియాంక సింగ్, శ్రీ రామ చంద్ర ఉండగా వీరిలో మానస్, శ్రీ రామ చంద్ర, ప్రియాంకలపై తొలిరోజు నుండే ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. ఈ ముగ్గురికి హౌస్‌లో మంచి స్క్రీన్ స్పేస్‌ దొరకడం కూడా ఒక కారణం కాగా ఎలాంటి నెగెటివిటీ లేకపోవడంతో వీళ్లు ముగ్గురూ సేఫ్ అయ్యారు. ఇక మిగిలింది ప్రియ అండ్ లహరి కాగా.. అసలు ప్రియ నామినేషన్స్‌లోకి వచ్చిన రోజే ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్నారంతా. రవి, లహరి గురించి తప్పుగా మాట్లాడడంతో ప్రియ మీద నెగెటివిటీ పెరిగిపోయింది.

Big Boss 5: లేస్తే హగ్.. కూర్చుంటే హగ్.. పడుకుంటే హగ్.. బిగ్‌బాసంటే హగ్‌లేనా?

కట్ చేస్తే.. రవి, లహరి గురించి మాట్లాడిన వీడియో నాగార్జున బయట పెట్టడంతో ప్రియపై ఉన్న నెగెటివిటీ అంతా రవి మీదకు మళ్లింది. అయితే లహరి కంటే రవికి బయట ప్రేక్షకులలో ఆదరణ ఎక్కువగా ఉండడంతో ఫైనల్ టార్గెట్ గా లహరి మిగిలిపోయింది. ఒకరకంగా చూస్తే ప్రియ, రవి చేసిన పనులకు లహరి బలి కావాల్సి వచ్చిందని.. ప్రియా చేసిన లహరి-రవి హగ్ కామెంట్స్ దుమారం అసలు కారణంగా మారిపోయింది. ఇక, ఇంట్లో ప్రతి చిన్న విషయానికి ఆమె కయ్యానికి కాలు దువ్వడంతో మొదట్లో ఆమెను మెచ్చుకున్నవాళ్లే చివరికి విమర్శించక తప్పలేదు.

Big Boss 5: ఆ ఇద్దరితో లహరి బిజీ.. అగ్గిరాజేసిన ప్రియా కామెంట్స్

హౌస్‌లో కొందరు కంటెస్టెంట్లు లహరిని కొంత టార్గెట్‌ చేశారు. మొదట్లో లహరికి దగ్గరైన మానస్‌ కు ప్రియ, ప్రియాంక, సిరి లేనిపోని కథలు చెప్పారు. లహరి కన్నింగ్‌ అని, ఆమె డ్రెస్సింగ్‌ గురించి కూడా తప్పుగా చెప్పారు. ఈ విషయాన్ని మానస్‌ లహరితో చెప్పడంతో లహరి వారిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం కూడా నెగటివిటీగా మారింది. మూడు వరాలు హౌస్లో ఉన్న లహరి ఇప్పటివరకు ఒక్క టాస్కు గెలవకపోగా.. ఎంటర్‌టైన్‌ చేసిన సందర్భం కూడా లేదు. దీనికి తోడు ముందు వెళ్లిన ఇద్దరూ కూడా లహరి ఇంట్లో ఉండడం వేస్ట్ అనేలా మాట్లాడారు. అలా.. అలా మూడు వారాలకే లహరి జర్నీ ముగిసింది.