ఆన్‌లైన్‌లో మిస్ సుబ్బలక్ష్మి.. మంచు లక్ష్మికి భయం వేస్తుందట

మంచు కుటుంబం నుంచి నిర్మాతగా సినిమాలలోకి వచ్చి తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటి మంచు లక్ష్మీ. వరుసగా సినిమాలు తీస్తూ.. నటిస్తూ ఉన్న మంచు లక్ష్మికి సినిమాలు నిర్మించాలంటే భయం వేస్తుందట. ఎంతో ఖర్చుపెట్టి కష్టపడి సినిమా తీస్తే సినిమాకు థియేటర్లు దొరకకపోవడం వల్ల ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని, ఈ క్రమంలో మంచి కథలను ప్రేక్షకులకు చేరువ చేసేందుకు వెబ్‌సిరీస్‌లపై దృష్టి సారించినట్లు ఆమె వెల్లడించారు. వంశీకృష్ణ దర్శకత్వంలో ‘మిస్ సుబ్బలక్ష్మి’ పేరుతో వెబ్ సిరీస్‌ను నిర్మిస్తూ, నటిస్తున్నట్లు చెప్పిన ఆమె అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్ర పోషించిన ‘మిస్ సుబ్బలక్ష్మి’ సినిమాకు ప్రముఖ రచయిత బలభద్రపాత్రుని రమణి కథ అందించినట్లు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం నుంచి ‘మిస్ సుబ్బలక్ష్మి’ వెబ్‌సిరీస్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తుందంటూ ఆమె చెప్పారు.
ఇదిలా ఉంటే మిస్ సుబ్బలక్ష్మీ సినిమాను తొలుత దియేటర్లలోనే విడుదల చేయాలని చిత్రయూనిట్ భావించింది. అయితే సినిమాకు దియేటర్లు దొరకకపోవడంతో ఈ రకమైన నిర్ణయం మంచులక్ష్మీ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంచు మోహన్ బాబు వంటి స్టార్ నిర్మాత కూతురు సినిమాలకే దియేటర్లు దొరకట్లేదంటే చిన్న సినిమాల పరిస్థితి ఏమిటి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.