చిరంజీవి సర్జా మళ్లీ పుట్టాడు.. మేఘనకు పండంటి మగబిడ్డ!

Meghana Raj Welcomes Baby Boy: ప్రముఖ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, పాపులర్ కన్నడ యువ హీరో చిరంజీవి సర్జా భార్య మేఘన రాజ్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బాబు పుట్టాడని చిరంజీవి సోదరుడు, హీరో ధృవ సర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తన అన్నయ్యే మళ్లీ పుడతాడంటూ చెప్పకొస్తున్న ధృవ ‘‘బేబీ బాయ్, జై హనుమాన్’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రిలేటివ్స్, హాస్పిటల్ స్టాఫ్ అందరికీ స్వీట్లు పంచారు. అలాగే తన బిడ్డకు వెండి ఉయ్యాల కావాలన్న అన్న కోరికను నేరవేర్చానని ధృవ తెలిపారు. బాబుకి ఏపేరు పెట్టాలన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు. చాలా సంతోసంగా ఉంది.. మళ్లీ నా చిరంజీవిని చూస్తున్నట్టే ఉందంటూ చిరంజీవి సర్జా తల్లి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు (అక్టోబర్ 22) మేఘనా, చిరంజీవి నిశ్చితార్థం చేసుకున్న రోజని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు.
కాగా చిరంజీవి సర్జా 2020 జూన్ 6న ఆకస్మికంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. హీరోయిన్ మేఘనతో పదేళ్ల ప్రేమాయణం తర్వాత 2018 ఆమెను వివాహం చేసుకున్నారు. అయితే చిరంజీవి చనిపోయే సమయానికే అతని మేఘన గర్భవతి. ఇటీవల మేఘనా బేబీ షవర్ పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి సర్జా మళ్లీ పుట్టాడంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
https://www.instagram.com/p/CGouiY_pDRu/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CGoxmjrJGr-/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CGorUbYAvRI/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CGoq3e-AssJ/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CGj_dNygJSq/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CF7GlFjHY_N/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CBkGaEOnK_D/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/tv/CGZ7KioHJm3/?utm_source=ig_web_copy_link