బాలుకు ఎక్మో సపోర్ట్‌తో చికిత్స.. తాజా హెల్త్ బులెటిన్ విడుదల..

  • Published By: sekhar ,Published On : August 22, 2020 / 07:33 PM IST
బాలుకు ఎక్మో సపోర్ట్‌తో చికిత్స.. తాజా హెల్త్ బులెటిన్ విడుదల..

Updated On : August 22, 2020 / 7:52 PM IST

SP Balasubrahmanyam Health Update: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం వైద్యులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు. ఎక్మో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్‌తో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

కాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. చెన్నైలోని ఎంజీఎంలో ఆయనకు ప్లాస్మా చికిత్స చేశారు. అప్పటి నుంచి ఆయన ఐసీయూలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొనడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖుల్లో ఊరట లభించినట్లైంది. బాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. అటు తనయుడు ఎస్పీ చరణ్ ఎప్పటికప్పుడు బాలు ఆరోగ్యపరిస్థితిపై అప్‌డేట్ ఇస్తున్నారు.

SPB Health Update