Raj Tarun – Lavanya : దొంగతనం కేసు కూడా పెట్టిన లావణ్య.. రాజ్ తరుణ్ పై అనుమానం అంట.. తాళిబొట్టు కూడా పోయిందంట..

తాజాగా లావణ్య దొంగతనం కేసు పెట్టింది.

Raj Tarun – Lavanya : దొంగతనం కేసు కూడా పెట్టిన లావణ్య.. రాజ్ తరుణ్ పై అనుమానం అంట.. తాళిబొట్టు కూడా పోయిందంట..

Lavanya Filed Theft Case she says Doubt on Raj Tarun

Updated On : September 10, 2024 / 2:29 PM IST

Raj Tarun – Lavanya : లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై ప్రేమించి మోసం చేసాడని పలు ఆరోపణలు చేసి, పోలీస్ కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. వీటిపై రాజ్ తరుణ్ అవన్నీ ఆరోపణలే అని పోలీసుల దగ్గర, కోర్టులో చూసుకుంటాను అని చెప్పాడు. తాజాగా లావణ్య దొంగతనం కేసు పెట్టింది.

రాజేంద్రనగర్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని లావణ్య ఇంట్లో చోరీ జరిగిందని, సుమారు 12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్టుగా మీడియాకు తెలిపింది లావణ్య. ఆభరణాలతో పాటు తన తాళిబొట్టు కూడా పోయిందట. అయితే ఈ విషయంలో రాజా తరుణ్, మాల్వి మల్హోత్రాపై అనుమానం ఉందని లావణ్య చెప్పింది.

Also Read : Reginaa Cassandrra : శేఖర్ కమ్ముల సినిమా ఛాన్స్ వదులుకున్న రెజీనా.. ఏ సినిమానో తెలుసా?

తాను జైలుకు వెళ్లేముందు ఇంటికి తాళం వేశానని, ఆ తాళం రాజ్ తరుణ్ దగ్గర ఉందని, పలు ఆభరణాలు, డాక్యుమెంట్లు తీసుకొని రాజ్ తరుణ్ ముంబై వెళ్లాడని, ఇటీవల లావణ్య ముంబై వెళ్లి రాజ్ తరుణ్ దగ్గర తాళం తీసుకొని వచ్చి చూస్తే ఇవేమి కనిపించట్లేదని ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. ఇలా రోజుకొక ఆరోపణలతో లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.