Reginaa Cassandrra : శేఖర్ కమ్ముల సినిమా ఛాన్స్ వదులుకున్న రెజీనా.. ఏ సినిమానో తెలుసా?

ఉత్సవం ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపింది రెజీనా.

Reginaa Cassandrra : శేఖర్ కమ్ముల సినిమా ఛాన్స్ వదులుకున్న రెజీనా.. ఏ సినిమానో తెలుసా?

Reginaa Cassandrra Rejected Sekhar Kammula Movie Here Details

Updated On : September 10, 2024 / 2:22 PM IST

Reginaa Cassandrra : హీరోయిన్ రెజీనా తెలుగులో శివ మనుసులో శృతి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన రెజీనా ప్రస్తుతం తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. అయితే రెజీనా నటించిన ఉత్సవం సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపింది రెజీనా.

ఈ క్రమంలో తన మొదటి సినిమా గురించి మాట్లాడింది. రెజీనా మాట్లాడుతూ.. నేను కాలేజీ చదివేటప్పటి నుంచే సినిమాలు చేశాను. కన్నడ, తమిళ్ లో రెండు సినిమాలు చేరేసిన తర్వాత తెలుగులో ఆడిషన్స్ ఇచ్చాను. తెలుగులో ఒకేసారి రెండు సినిమాలకు సెలెక్ట్ అయ్యాను. శివ మనసులో శృతి, శేఖర్ కమ్ముల గారి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు సెలెక్ట్ అయ్యాను. రెండు సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను. రెండు ఒకేసారి అయ్యే సినిమాలు కాబట్టి అప్పుడు ఏదో ఒక సినిమాకే డేట్స్ ఇవ్వాలి, ఏ సినిమా చేయాలి అనేది నేనే డిసైడ్ చేసుకోవాలి. నాకు కెరీర్ మొదట్లోనే అలా రెండు సినిమాలు వచ్చి ఛాయస్ రావడం గొప్ప విషయం అని తెలిపింది.

Also Read : Siddharth – Aditi Rao Hydari : ఏకంగా అమెరికా వెళ్లి.. యాపిల్ ఫోన్ కొని యాపిల్ సీఈఓతో ముచ్చట్లు పెట్టిన సిద్దార్థ్, అదితి..

దీంతో శివ మనసులో శృతి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలు రెండిట్లో ఛాన్స్ రాగా రెజీనా శేఖర్ కమ్ముల సినిమా వదిలేసుకొని శివ మనసులో శృతి సినిమా చేసింది. శివ మనసులో శృతి సినిమాలో రెజీనా మెయిన్ హీరోయిన్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో మెయిన్ హీరోయిన్స్ అంటూ ఎవరూ లేరని తెలిసిందే. చాలా మంది కొత్తవాళ్లతో ఆ సినిమా తీశారు.

Reginaa Cassandrra Rejected Sekhar Kammula Movie Here Details