Lavanya Tripathi : అయోధ్యలో జన్మించినందుకు అదృష్టంగా భావిస్తున్నాను.. మెగా కోడలు లావణ్య ఎమోషనల్ పోస్ట్..
లావణ్య త్రిపాఠి కూడా అయోధ్య రామ మందిరంపై ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Lavanya Tripathi Emotional post on Ayodhya Ram Mandir
Lavanya Tripathi : హీరోయిన్ గా ప్రేక్షకులని మెప్పించిన లావణ్య త్రిపాఠి ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత లావణ్య మరింత వైరల్ అయింది. మెగా కోడలు కావడంతో లావణ్య పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే లావణ్య అయోధ్యలో జన్మించిందని చాలా తక్కువ మందికి తెలుసు. నిన్న దేశవ్యాప్తంగా 500 ఏళ్ళ నుంచి ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం(Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవం ఘనంగా జరగడంతో దేశమంతా పండగ వాతావరణం నెలకొంది.
దేశ ప్రజలు రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. అన్నదానాలు చేశారు. ఘనంగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పలువురు సెలబ్రిటీలు ఆలయాలకు వెళ్లారు. లావణ్య త్రిపాఠి కూడా అయోధ్య రామ మందిరంపై ఎమోషనల్ పోస్ట్ చేసింది. లావణ్య అయోధ్యలో పుట్టడంతో ఆమెకు రామయ్య ఆలయంతో మరింత అటాచ్మెంట్ ఉంది.
Also Read : Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం పై టాలీవుడ్ సెలబ్రిటీస్ ట్వీట్స్..
పద్దతిగా చీరలో రెడీ అయి, సీతారాముల పట్టాభిషేకం విగ్రహం ఉన్న భారీ హారం మెడలో ధరించి ఆమె ఫోటోలను షేర్ చేస్తూ.. రాముడి పుట్టిల్లు అయిన అయోధ్యలో నేను పుట్టడం, ఈ అద్భుతమైం కార్యక్రమాన్ని చూడటం నా అదృష్టం. రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చూడటం నాతో పాటు దేశప్రజలందరికి గర్వకారణం. ఈ సందర్భంగా రామ్ పరివారాన్ని నగలుగా ధరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాణ ప్రతిష్ట వేడుక అయోధ్యకు మాత్రమే కాదు దేశం మొత్తానికి సంబంధించింది. దేశం మొత్తం కలిసి వచ్చే సమయం ఇది. దేశంలోని ప్రజలందరి మధ్య ఐక్యత భావాన్ని నెలకొల్పుతుంది. పెదవులపై జై శ్రీరామ్ అంటూ, గుండెల్లో దైవభక్తిని నింపుకొని శాంతి దేశమంతా ఉండాలని ప్రార్ధిద్దాం అంటూ పోస్ట్ చేసింది. దీంతో లావణ్య పోస్ట్ వైరల్ అవ్వగా లావణ్య అయోధ్యలో పుట్టిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అదృష్టవంతురాలు అని కామెంట్స్ చేస్తున్నారు.