Happy Birthday Movie: హ్యాపీ బర్త్‌డే ట్రైలర్.. కామెడీతో అరాచకం!

టాలీవుడ్‌లో కామెడీ సినిమాలకు ఎప్పటికీ ఆదరణ లభిస్తుంది. అయితే రొటీన్ కామెడీతో కాకుండా కంటెంట్ ఉన్న కామెడీతో సినిమా వస్తే, ఆ సినిమాకు ప్రేక్షకులు.....

Happy Birthday Movie: హ్యాపీ బర్త్‌డే ట్రైలర్.. కామెడీతో అరాచకం!

Lavanya Tripathi Happy Birthday Movie Trailer Gets Hilarious Response

Updated On : June 29, 2022 / 5:20 PM IST

Happy Birthday Movie: టాలీవుడ్‌లో కామెడీ సినిమాలకు ఎప్పటికీ ఆదరణ లభిస్తుంది. అయితే రొటీన్ కామెడీతో కాకుండా కంటెంట్ ఉన్న కామెడీతో సినిమా వస్తే, ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇప్పుడు ఇలాంటి కామెడీ సినిమాతో మనముందుకు రాబోతోంది అందాల భామ లావణ్య త్రిపాఠి. గతంలో వచ్చిన ‘మత్తు వదలరా’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రితేష్ రాణా మరోసారి ‘హ్యాపీ బర్త్‌డే’ అనే సరియల్ కామెడీ మూవీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయ్యాడు.

Lavanya Tripathi : లావణ్య త్రిపాఠిని చీప్ యాక్టర్ అన్న నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన లావణ్య

ఇప్పటికే హ్యాపీ బర్త్‌డే చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్స్ ఈ సినిమాపై ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. కాగా.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం కామెడీతో నింపేశారు చిత్ర యూనిట్. గన్స్, గ్యాంగ్స్, గర్ల్స్‌తో ఈ ట్రైలర్‌ను డిఫరెంట్ కామెడీతో నింపేశారు. ఒక లైటర్ కోసం కొన్ని గ్యాంగ్స్ పడే పాట్లు, దాన్ని దక్కించుకునేందుకు వారు చేసే కామెడీ ఈ సినిమాను ఖచ్చితంగా సక్సెస్ చేస్తుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అయితే ఆ లైటర్ ప్రత్యేకత ఏమిటనేది మనకు ఈ ట్రైలర్‌లో సస్పెన్స్‌గా చూపెట్టారు.

ఇక ఈ సినిమాలో టాలీవుడ్‌లో పేరున్న కమెడియన్స్ అందరూ మనకు కనిపించబోతున్నారు. లావణ్య త్రిపాఠి తన కెరీర్‌లోనే ఇలాంటి సరియల్ కామెడీ జోనర్ చిత్రాన్ని చేయడం ఇదే తొలిసారి. ఆమె ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, నరేష్ అగస్త్య, సత్య, గుండు సుదర్శన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు రాజమౌళి ఈ ట్రైలర్ హిలేరియస్‌గా ఉందని తెలిపారు. ఫుల్ హార్టెడ్‌గా సినిమాలు తీస్తే.. కొత్తదనంతో కూడిన కధలతో సినిమాలు వస్తే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇక హ్యాపీ బర్త్‌డే సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు.