Dilip Kumar : శ్వాసకోస సమస్యలతో ఆస్పత్రిలో చేరిన దిలీప్ కుమార్

Legendary Actor Dilip Kumar Hospitalised Due To Breathlessness
Dilip Kumar : బాలివుడ్ సీనియర్ నటుడు దిలీప్‌కుమార్ అస్వస్ధతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం మరో సారి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబై పీడీలోని హిందుజా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
98 ఏళ్ల దిలీప్‌కుమార్ ఆరోగ్యాన్ని సీనియర్ డాక్టర్స్. నితిన్ గోఖలే, జలీల్ పార్కర్,పర్యవేక్షిస్తున్నారు. గత నెలలోనే ఆస్పత్రిలో చేరి అన్ని పరీక్షలు చేయించుకుని దిలీప్ కుమార్ డిశ్చార్జ్ అయ్యారు. 1944లో జ్వార్ భాటాతో దిలీప్ కుమార్ సినీరంగ ప్రవేశం చేశారు. 1947 లో వచ్చిన జూగ్ను చిత్రంతో ఆయన వెలుగులోకి వచ్చారు. కోహినూర్, ఆజాద్, మొఘల్-ఎ-అజామ్, బైరాగ్, శక్తి, దేవదాస్, గోపి, ఆద్మీ, సంఘర్ష్ వంటి పలు చిత్రాలలో నటించారు. చివరిసారిగా ఆయన 1998లో విడుదలైన ‘ఖిలా’ చిత్రంలో నటించారు.
2020లో తన ఇద్దరు సోదరులు మరణించటంతో దిలీప్ కుమార్ గతేడాది డిసెంబర్ 11న తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోలేదు. కరోనా వైరస్ వ్యాప్తి….ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన, భార్య సైరాబాను వేర్వేరు ప్రదేశాల్లో జీవిస్తున్నారు.