Green India Challenge: మొక్కలు నాటిన కపిల్ దేవ్, రాజీషా విజయన్

  • Published By: sekhar ,Published On : October 14, 2020 / 06:40 PM IST
Green India Challenge: మొక్కలు నాటిన కపిల్ దేవ్, రాజీషా విజయన్

Updated On : October 14, 2020 / 6:45 PM IST

Kapil Dev – Rajisha Vijayan: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విన్నూత్న రూపంలో చాలా బ్రహ్మాండంగా ముందుకు కొనసాగుతు ప్రముఖుల మన్నలను పొందుతోంది.
ఇందులో భాగంగా నేడు ఢిల్లీలోని సుందర్ నగర్ లోగల తన నివాసంలో క్రికెట్ దిగ్గజం భారతదేశం క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మొక్కలు నాటారు.


ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వాతావరణ కాలుష్యం తగ్గి మంచి వాతావరణం కావాలని ఆశిద్దాం అని, అందుకోసం భారతీయులందరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. మన భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించడం మన అందరి బాధ్యత అన్నారు.

Kapil Dev

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ రాజీషా విజయన్
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వర్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు కేరళలోని తన నివాస సముదాయంలో ప్రముఖ హీరోయిన్ రాజీషా విజయన్ మూడు మొక్కలు నాటారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తెలపడం జరిగింది.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం కానీ మా ఇంటి ప్రదేశంలో ఖాళీ స్థలం లేని కారణంగా నేను ఇష్టంతో ఈ పండ్ల మొక్కలను మా ఇంటి బాల్కనీలో పెట్టుకోవడం జరుగుతుంది.. వీటిని సంరక్షించే బాధ్యత కూడా నీనే తీసుకుంటానని తెలిపారు. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అని తెలిపారు. ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని దీనిని ప్రతి ఒక్కరూ స్వీకరించి మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.

https://www.instagram.com/p/CGPiVChlXzq/?utm_source=ig_web_copy_link