Lokesh Kanagaraj : లియో సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కి గాయాలు.. అభిమానుల వలనే..!

లోకేష్ కనగరాజ్ అభిమానుల వలన గాయాలు పాలయ్యాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా..

Lokesh Kanagaraj : లియో సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కి గాయాలు.. అభిమానుల వలనే..!

Leo movie director Lokesh Kanagaraj injured at kerala visit

Updated On : October 24, 2023 / 2:54 PM IST

Lokesh Kanagaraj : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. తన సినిమాలతో హీరోలతో సమానంగా ఆడియన్స్ లో ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన లియో సినిమాకి కూడా లోకేష్ కనగరాజ్ వలనే తెలుగు, హిందీ, ఇతర భాషల్లో పెద్ద మార్కెట్ జరిగింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ.. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో సునామీ సృష్టిస్తుంది. ఇది ఇలా ఉంటే, తాజాగా లోకేష్ కనగరాజ్ అభిమానుల వలన గాయాలు పాలయ్యాడు.

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా లోకేష్ కనగరాజ్ పలు ప్రాంతాలను సందర్శిస్తూ సందడి చేస్తున్నాడు. ఈక్రమంలోనే తాజాగా కేరళలోని పాలక్కాడ్ లో సందడి చేశాడు. ఇక లోకేష్ కనగరాజ్ ని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో వచ్చారు.ఇక ఈ జన సమూహం మధ్యలో లోకేష్ చిక్కుకొని గాయాలు పాలయ్యాడు. ఈ విషయాన్ని లోకేష్ తన సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలియజేశాడు. చిన్న గాయం అయ్యినట్లు, అందువల్లే ఇవాళ హాజరవాల్సిన మరిన్ని రెండు ప్రాంతాలకు, ప్రెస్ మీట్స్ కి రాలేకపోతున్నట్లు తెలియజేశాడు.

Also read : Suma Kanakala : నేను సడెన్ గా చనిపోతే ఏ ఇన్స్యూరెన్స్, ఎంతొస్తుంది.. అన్నీ మా పిల్లలకు చెప్పాను..

కేరళకి త్వరలోనే మళ్ళీ వస్తానని, అప్పటివరకు లియో మూవీ చూస్తూ ఎంజాయ్ చేయండి, నా మీద ఇంత ప్రేమ చూపిస్తునందుకు చాలా థాంక్యూ, లవ్ యూ.. అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్టు చూసిన ఆడియన్స్ జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక లియో కలెక్షన్స్ విషయానికి వస్తే.. నాలుగు రోజుల్లోనే 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని సంచలనం సృష్టించింది. తెలుగులో కూడా ఈ సినిమా దాదాపు ఇప్పటికే 25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం.