Suma Kanakala : నేను సడెన్ గా చనిపోతే ఏ ఇన్స్యూరెన్స్, ఎంతొస్తుంది.. అన్నీ మా పిల్లలకు చెప్పాను..
ఇటీవల సుమ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Suma Kanakala shares her all insurance details to her Children
Suma Kanakala : మలయాళీ అమ్మాయి అయినా తెలుగులో సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చి యాంకర్ గా దాదాపు 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని మెప్పించి తెలుగు వారింట్లో ఒక భాగమైంది సుమ కనకాల. తెలుగు వారింటి ఆడపడుచులా పేరు తెచ్చుకుంది. ఓ పక్క యాంకర్ గా షోలు, మరో పక్క సినిమా ఈవెంట్స్, అప్పుడప్పుడు నటిగా సినిమాలు, యూట్యూబ్ లో వీడియోలు.. ఇలా ఫుల్ బిజీగా ఉంది సుమ.
త్వరలోనే సుమ తనయుడు రోషన్ కనకాల కూడా హీరోగా రాబోతున్నాడు. ఇటీవల సుమ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సుమ మాట్లాడుతూ.. ఇళ్లల్లోకి పనికి వచ్చే ఆడవాళ్ళలో చాలా మంది డబ్బులు లేక, వాళ్ళ భర్త చనిపోయి ఉంటేనో వస్తూ ఉంటారు. వాళ్లకి కనీసం బ్యాంక్, డబ్బులు దాచుకోవాలి, ఇన్సూరెన్స్ లు.. ఇలాంటివి ఏమి తెలియవు. వాళ్ళ భర్త ఇన్సూరెన్స్ చేసి ఉంటే అతను చనిపోయాక ఎంతో కొంత డబ్బులు వచ్చేవి. కానీ వాళ్లకు ఇవి తెలీదు. అందుకే మనకు తెలిసినంతవరకు అందరికి వీటి గురించి చెప్పాలి అని చెప్పింది.
Also Read : Rana Daggubati : అడివి శేష్ దర్శకత్వంలో రానా హీరోగా సినిమా?
అలాగే.. నేను ఆల్రెడీ నా పిల్లలకు ఇన్సూరెన్స్ ల గురించి అంతా చెప్పాను. ఒక రోజు నా పిల్లలిద్దరినీ కూర్చోపెట్టి నేను ఒకవేళ సడెన్ గా చనిపోతే ఎవరికి ఎంతొస్తుంది? ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అని ఇన్సూరెన్స్, డబ్బుల లెక్కలు అన్నీ చెప్పాను. మా పాప ఎందుకు అలా మాట్లాడతావు మమ్మి అంది. కానీ మనం రియాల్టీ చెప్పాలి. రేపు ఏం జరుగుతుందో తెలీదు కాబట్టి అన్నీ ధైర్యంగా పిల్లలకు కూడా చెప్పాలి అని చెప్పింది. దీంతో సుమ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పలువురు సుమ చెప్పింది కరెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు.