Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్ కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ ఇండియన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు....

Liger First Single Update Is Here
Liger: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్ కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ ఇండియన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
Liger: అమీర్ ఖాన్ బాటలో లైగర్.. ఫోటో చూస్తే ఫ్యూజులు ఔట్!
ఇక రీసెంట్‌గా లైగర్ సినిమా కోసం తాను ఎలా కష్టపడుతున్నానో వివరిస్తూ విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఫోటో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలసిందే. ఈ ఫోటోలో కేవలం ఓ పూలబొకేను మాత్రమే అడ్డంగా పెట్టుకుని ఇచ్చిన పోజ్ నేషన్‌వైడ్‌గా ట్రెండ్ అయ్యింది. ఇక ఇప్పుడు లైగర్ సినిమా నుండి మరో అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా రిలీజ్’కు ఇంకా 50 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే అక్డీ పక్డీ అనే ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను జూలై 11న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
Liger: నువ్వు పుట్టిందే గెలిచేటందుకు.. లైగర్ హంట్ బిగిన్స్!
ఈ పాటకు సంబంధించిన ప్రోమో టీజర్‌ను జూలై 8న రిలీజ్ చేస్తున్నట్లు లైగర్ టీమ్ ప్రకటించింది. ఈ అప్‌డేట్‌తో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ సినిమా నుండి అప్‌డేట్ రాబోతుందని.. ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కోసం తామెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా, లెజెండరీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
50 Days to Release ?
Let’s Celebrate with some Massssss Music!AKDI PAKDI
1st song – July 11th
Promo on July 8th.#Liger#LigerOnAug25th pic.twitter.com/8UxkPfhat3— Vijay Deverakonda (@TheDeverakonda) July 6, 2022