Samantha: సమంత ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు.. లైట్స్, కెమెరా, యాక్షన్ మార్చలేనివంటూ ఎమోషనల్

చైతూతో విడాకుల తర్వాత సమంత ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. వరుస సినిమాలకి ఓకే చెప్తుంది. వచ్చిన ప్రతి ఛాన్స్ ని వాడుకుంటుంది. ఒక పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, మరోవైపు కమర్షియల్..

Samantha: సమంత ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు.. లైట్స్, కెమెరా, యాక్షన్ మార్చలేనివంటూ ఎమోషనల్

Samantha

Updated On : February 27, 2022 / 9:55 AM IST

Samantha: చైతూతో విడాకుల తర్వాత సమంత ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. వరుస సినిమాలకి ఓకే చెప్తుంది. వచ్చిన ప్రతి ఛాన్స్ ని వాడుకుంటుంది. ఒక పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, మరోవైపు కమర్షియల్ సినిమాలు, వీటితో పాటు ఐటెం సాంగ్స్ లో కూడా దుమ్ము లేపుతుంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు అనౌన్స్ చెయ్యడమే కాకుండా కెరీర్ లో ఎప్పుడూ లేనంత దూకుడు చూపిస్తోంది.

Samantha: నా కుటుంబం విచ్ఛిన్నమైంది.. సామ్ మనసులో ఇంత బాధ ఉందా?

ఇప్పటికే తమిళ్, తెలుగు, హిందీ, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సమంత.. హాలీవుడ్ లో కూడా ఒక సినిమాకి సైన్ చేసింది. అయితే.. సమంతా ఇప్పటికిప్పుడు ఓ స్టార్ హీరోయిన్ అయిపోలేదు. ఓ చిన్న ఆర్టిస్ట్ గానే కెరీర్ ఆరంభించిన సామ్ 12 ఏళ్లుగా కస్టపడి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయికి చేరుకుంది. నటిగా తన కెరీర్ ని మొదలు పెట్టి నేటితో 12 పూర్తి చేసుకున్న సమంతా ఈ సందర్భంగా తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

Samantha: నిన్ను నేను ప్రెగ్నెంట్ చేయనా.. సామ్‌పై శృతిమించిన నెటిజన్ క్వశ్చన్!

ఈరోజుతో నా సినీ ప్రయాణం 12 ఏళ్ళకి చేరుకుంది. లైట్స్, కెమెరా, యాక్షన్ అనే మూడు మార్చలేని పదాలతో ఇక్కడి వరకూ చేరుకున్నాను.. ఈ ప్రయాణంలో అందరికీ ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నానని ముఖ్యంగా నాకు విధేయతతో కలిగి ఉన్న ఫ్యాన్స్ కి ఎంతో ఋణపడి ఉన్నాననీ సమంతా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. సమంతా ప్రస్తుతం ఓ తమిళ సినిమాతో పాటు తెలుగులో రెండు సినిమా విడుదలకి సిద్ధమవుతుండగా బాలీవుడ్ లో ఒకటి.. హాలీవుడ్ లో ఒకటి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్నాయి.