‘ద లయన్ కింగ్’ ట్రైలర్ రిలీజ్

1994లో ఘనవిజయం సాధించి చిన్నా, పెద్దా అందరినీ అలరించిన హాలీవుడ్ యానిమేషన్ చిత్రం ‘ది లయన్ కింగ్’. ఇప్పుడు అదే సినిమాను మరింత ఉన్నత ప్రమాణాలతో 3డీ యానిమేషన్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు జోన్ ఫావ్రే దర్శకుడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో సన్నివేశాలు యానిమేషన్ లవర్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఇప్పటికే డిస్నీ సంస్థ నుంచి యానిమేషన్ లుగా సక్సెస్ అయిన సిండ్రెల్లా, ద జంగల్ బుక్ లు 3డీ లోనూ ఆకట్టుకోగా అదే విదంగా ‘ద లయన్ కింగ్’ కూడా విజయం సాధిస్తుందన్ననమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా 2019 జూలై 19న రిలీజ్ కానుంది. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.