Lockdown:‘లాక్‌‌డౌన్ లేడీస్’- మెగా వీడియో వైరల్..

ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో సెలబ్రిటీలందరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. రోజువారీ పనులతో సహా రకరకాల వీడియోల ద్వారా వారిని అలరిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మే

Lockdown:ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో సెలబ్రిటీలందరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. రోజువారీ పనులతో సహా రకరకాల వీడియోల ద్వారా వారిని అలరిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మేల్ సెలబ్రిటీలందరూ ‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. రాజమౌళి నుండి అనిల్ రావిపూడి వరకు అందరూ ఈ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా మెగాస్టార్ కుటుంబానికి చెందిన మహిళలు మరో సరికొత్త కాన్సెప్ట్‌తో ముందుకొచ్చారు.

మేకప్, నో మేకప్ లుక్స్‌తో కూడిన వీడియోను రూపొందించారు. ఈ వీడియోలో చిరంజీవి కూతుళ్లు సుస్మిత, శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డితో సహా మరికొందరు మహిళలు కనిపించారు. ‘లాక్‌డౌన్ లేడీస్’ పేరుతో నిహారిక ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.