Pushpa 2 : పుష్ప 2 సెట్స్ నుంచి వీడియో లీక్.. బాబోయ్ ఎన్ని లారీలు..

పుష్ప 2 సెట్స్ నుంచి వీడియో లీక్ అయ్యింది. ఆ వీడియోలో 100 పైగా లారీలు..

Pushpa 2 : పుష్ప 2 సెట్స్ నుంచి వీడియో లీక్.. బాబోయ్ ఎన్ని లారీలు..

lorries video leak from Allu Arjun Pushpa 2 sets

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరకెక్కిస్తున్న ‘పుష్ప 2’ పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇటీవల నేషనల్ అవార్డు కూడా అందుకోవడంతో నేషనల్ వైడ్ ఈ సెకండ్ పార్ట్ ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ మూవీ నుంచి ఒక వీడియో లీక్ అయ్యింది. ఆ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే.

Bigg Boss 7 Day 3 : ఒక హీరోయిన్‌ని ముద్దు అడిగితే.. మరో హీరోయిన్ పెట్టింది.. మూడోరోజు హైలైట్స్..

పుష్ప 2లో భారీ లారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సెట్స్ నుంచి పలు లారీ సీక్వెన్స్ లు లీక్ అయ్యాయి. తాజాగా మరో వీడియో బయటకి వచ్చింది. ఆ వీడియోలో 100 పైగా లారీలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వీడియో చూస్తుంటే.. సుకుమార్ సెకండ్ పార్ట్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని ఇప్పటికే మేకర్స్ తెలియజేశారు.

Mrunal Thakur : చిరంజీవి Mega 157లో మృణాల్ ఠాకూర్.. నిజమేనా..?

కాగా ఈ మూవీలో ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) మెయిన్ విలన్ గా కనిపించనుండగా సునీల్, అనసూయ, ధనంజయ్, జగదీష్ తదితరులు నెగటివ్ షేడ్ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక రష్మిక మందన్న (Rashmika Mandanna) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ కి తన సంగీతంతో మూవీకి ఓ రేంజ్ క్రేజ్ ని సంపాదించిపెట్టిన దేవిశ్రీప్రసాద్.. నేషనల్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

దీంతో సెకండ్ పార్ట్ సంగీతం పై మరింత క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఐటెం నెంబర్ పై మరింత ఆసక్తి నెలకుంది. మొదటి పార్ట్ లో ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ సాంగ్ తో ఒక ఊపు ఉపేయడంతో.. సెకండ్ పార్ట్ కి ఎలాంటి పెప్పి సాంగ్ ఇస్తాడా అని మాస్ ఆడియన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.