Love Mocktail 2 : కన్నడ సూపర్ హిట్ సినిమా.. ఇప్పుడు తెలుగులో.. రేపే రిలీజ్..
కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్ 2’ సినిమా తెలుగులో రాబోతుంది.

Kannada Super Hit Movie Love Mocktail 2 Releasing in Telugu
Love Mocktail 2 : కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్ 2’ సినిమా తెలుగులో రాబోతుంది. డార్లింగ్ కృష్ణ, రాచెల్ డేవిడ్, మిలనా నాగరాజ్, రచన, అమృత.. పలువురు ముఖ్య పాత్రలో డార్లింగ్ కృష్ణ దర్శకత్వంలోనే ఈ ‘లవ్ మాక్‌టైల్ 2’ సినిమా తెరకెక్కింది. లవ్ మాక్‌టైల్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కూడా కన్నడలో భారీ విజయం సాధించింది. ఈ లవ్ మాక్‌టైల్ 2 సినిమాని తెలుగులో కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్ పై MVR కృష్ణ రిలీజ్ చేస్తున్నారు.
Also Read : Akhil Akkineni : వామ్మో అయ్యగారు ఇలా అయిపోయారేంటి.. జుట్టు పెంచేసి అఖిల్ కొత్త లుక్.. సినిమా కోసమేనా?
‘లవ్ మాక్‌టైల్ 2’ సినిమా రేపు జూన్ 14న తెలుగులో గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ వచ్చి ప్రేక్షకులని మెప్పించాయి. ఈ సందర్భంగా నిర్మాత MVR కృష్ణ మాట్లాడుతూ.. కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన ‘లవ్ మాక్‌టైల్ 2’ సినిమాని తెలుగులో తీసుకువస్తున్నాం. ఈ నెల 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమా. గతంలో లవ్ మాక్‌టైల్ కూడా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ‘లవ్ మాక్‌టైల్ 2’ డిస్ట్రిబ్యూటర్లు సినిమాను చూసి బాగుందని రిలీజ్ చేస్తున్నారు. కన్నడలో పెద్ద హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది అని తెలిపారు.