Akhil Akkineni : వామ్మో అయ్యగారు ఇలా అయిపోయారేంటి.. జుట్టు పెంచేసి అఖిల్ కొత్త లుక్.. సినిమా కోసమేనా?
తాజాగా అఖిల్ కొత్త లుక్ వైరల్ అవుతుంది.

Akhil Akkineni New Look with Huge Hair Goes Viral
Akhil Akkineni : అక్కినేని అఖిల్ కి ఇప్పటిదాకా భారీ హిట్ పడలేదు. మొదటి సినిమా నుంచి బాగానే కష్టపడుతున్నా సరైన విజయం మాత్రం రావట్లేదు. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ అయితే ఫ్లాప్ లేదా యావరేజ్ గానే మిగిలిపోయాయి. గత సినిమా ఏజెంట్ అయితే డిజాస్టర్ గా మిగిలింది. ఆ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసి, జుట్టు పెంచి మేకోవర్ కోసం బాగా కష్టపడ్డాడు. ఏజెంట్ సినిమా వచ్చి సంవత్సరం దాటేసినా అఖిల్ నెక్స్ట్ సినిమా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.
అయితే తాజాగా అఖిల్ కొత్త లుక్ వైరల్ అవుతుంది. అఖిల్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లగా అక్కడ తీసిన అఖిల్ వీడియో వైరల్ గా మారింది. అఖిల్ బాగా జుట్టు పెంచేసుకొని ఊహించని సరికొత్త లుక్ లో కనపడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అఖిల్ ఏంటి ఇంతలా జుట్టు పెంచేసాడు, నెక్స్ట్ సినిమా కోసమా? ఇలా మారిపోయాడు ఏంటి అయ్యగారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Actress Hema : నటి హేమకు బిగ్ రిలీఫ్.. రేవ్ పార్టీ కేసులో బెయిల్ మంజూరు..!
అయితే అఖిల్ నెక్స్ట్ సినిమా అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో పీరియాడిక్ సబ్జెక్టుతో రాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకి ‘ధీర’, తారక సింహా రెడ్డి.. అనే టైటిల్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఆ సినిమా కోసమే అఖిల్ ఇలా జుట్టు పెంచేసి కొత్త మేకోవర్ ట్రై చేస్తున్నాడా? లేక ఇంకేదైనా కారణమా అని అభిమానులు కూడా అఖిల్ కొత్త లుక్ పై చర్చించుకుంటున్నారు. మొత్తానికి అయ్యగారు కొత్త లుక్ తో మరోసారి వైరల్ అవుతున్నారు.
#AkhilAkkineni was spotted at the airport with a shocking makeover. pic.twitter.com/FXpWzP31bM
— Gulte (@GulteOfficial) June 12, 2024