Love Reddy : ఆకట్టుకుంటున్న లవ్ రెడ్డి గ్లింప్స్..

ఇటీవల నందమూరి బాలకృష్ణ చేతులు మీదుగా టైటిల్ లోగో లాంచ్ చేసుకున్న మూవీ 'లవ్ రెడ్డి'. సింగర్‌గా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు అంజన్ రామచంద్ర ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 'బియాండ్ బ్రేకప్' అనే ఒక వెబ్ సిరీస్ తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్టర్.. తన మొదటి సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సిద్దమయ్యాడు. ఇక ఈ మూవీకి సంబంధించిన వీడియో గ్లింప్స్ ని డైరెక్టర్ 'ప్రశాంత్ వర్మ' చేతులు మీదగా విడుదల చేశారు మేకర్స్.

Love Reddy : ఆకట్టుకుంటున్న లవ్ రెడ్డి గ్లింప్స్..

Love Reddy video glimpse released

Updated On : January 3, 2023 / 5:14 PM IST

Love Reddy : ఇటీవల నందమూరి బాలకృష్ణ చేతులు మీదుగా టైటిల్ లోగో లాంచ్ చేసుకున్న మూవీ ‘లవ్ రెడ్డి’. సింగర్‌గా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు అంజన్ రామచంద్ర ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ‘బియాండ్ బ్రేకప్’ అనే ఒక వెబ్ సిరీస్ తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్టర్.. తన మొదటి సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సిద్దమయ్యాడు. ఇక ఈ మూవీకి సంబంధించిన వీడియో గ్లింప్స్ ని డైరెక్టర్ ‘ప్రశాంత్ వర్మ’ చేతులు మీదగా విడుదల చేశారు మేకర్స్.

Kalyan Ram : ‘అమిగోస్’లో త్రిపాత్రాభినయం చేయబోతున్న కళ్యాణ్ రామ్?

వీడియో గ్లింప్స్ చూసిన వాళ్లందరికి ఒక ఫ్రెష్ ఫీల్ ని అందిస్తుంది. ఇక ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. “లవ్ రెడ్డి గ్లిమ్స్ చాలా ఫ్రెష్ గా ఉంది. ఈ గ్లిమ్స్ చూస్తుంటే నాకు కూడా ఒక లవ్ స్టొరీ చెయ్యాలని అనిపిస్తుంది. అందరూ యంగ్ టీమ్ కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అంటూ వ్యాఖ్యానించాడు.

గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో స్మరన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. త్వరలోనే టీజర్ అండ్ ట్రైలర్ ని కూడా విడుదల చేయనున్నారు.