పిచ్చ కామెడీగా లుకా చుప్పి ట్రైలర్

లుకా చుప్పి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్.

  • Published By: sekhar ,Published On : January 24, 2019 / 10:47 AM IST
పిచ్చ కామెడీగా లుకా చుప్పి ట్రైలర్

Updated On : January 24, 2019 / 10:47 AM IST

లుకా చుప్పి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్.

బాలీవుడ్ యంగ్ పెయిర్ కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా, లక్ష్మణ్ ఉతేకర్ డైరెక్షన్‌లో, మ్యాడాక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజయ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఫిలిం, లుకా చుప్పి. హిందీలో లుకా చుప్పి అంటే దాగుడు మూతలు అని అర్థం. రీసెంట్‌గా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రిపోర్టర్‌గా పనిచేసే కార్తీక్, కృతిని ఇష్టపడి పెళ్ళి చేసుకుందామని అడిగితే ఆమె ఒప్పుకోదు. అయితే, పెళ్ళికి ముందు లివ్ ఇన్ రిలేషన్‌షిప్ మాత్రం బాగుంటుంది అని చెప్పడంతో, కార్తీక్ భయంగానే ఒప్పుకుంటాడు. కార్తీక్, కృతి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, వేరుగా ఒక ఇళ్ళు రెంట్‌కి తీసుకుని సహజీవనం చేస్తుంటారు.

వీళ్ళ వ్యవహారం, ఇద్దరి ఇళ్ళల్లో పెద్దవాళ్ళకి తెలిసి, వాళ్ళతో కలిసి ఉండడానికి కార్తీక్, కృతి ఉంటున్న ఇంటికొస్తారు.
ఆ తర్వాత ఏం జరిగింది, సక్సెస్ ఫుల్‌గా సహజీవనం చేస్తున్న ఈ జంట ఎలా పెళ్ళి చేసుకున్నారు? అనేది లుకా చుప్పి కథ. ఈ విషయం ట్రైలర్ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. కార్తీక్, కృతిల కెమిస్ట్రీ బాగుంది. మార్చ్ 1న లుకా చుప్పి రిలీజ్ కానుంది.

వాచ్ లుకా చుప్పి ట్రైలర్…