Love Your Father : ‘LYF – లవ్ యువర్ ఫాదర్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. చాలా మంది ఫోన్లు చేసి సినిమా చూశాక నాన్న గుర్తొస్తున్నారు అంటున్నారు..

తండ్రి-కొడుకుల అనుబంధానికి కాస్త డివోషనల్ టచ్ ఇచ్చి ట్విస్ట్ లతో తెరకెక్కించారు ఈ సినిమాని.

Love Your Father : ‘LYF – లవ్ యువర్ ఫాదర్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. చాలా మంది ఫోన్లు చేసి సినిమా చూశాక నాన్న గుర్తొస్తున్నారు అంటున్నారు..

Lyf Love Your Father Movie Success Celebrations

Updated On : April 6, 2025 / 4:12 PM IST

Love Your Father : శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా ఎస్పీ చరణ్, ప్రవీణ్, నవాబ్ షా, రియా కపూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘LYF – లవ్ యువర్ ఫాదర్’. మనీషా ఆర్ట్స్ & మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్ పై కిషోర్ రాటి, మహేష్ రాటి, ఏ రామస్వామి రెడ్డి నిర్మాణంలో పవన్ కేతరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ఏప్రిల్ 4న థియేటర్స్ లో రిలీజయింది.

Also Read : Ari Movie Song : అనసూయ ‘అరి’ సినిమా నుంచి నుంచి ‘భగ భగ..’ సాంగ్ రిలీజ్.. సినిమా మాత్రం వాయిదా..

తండ్రి-కొడుకుల అనుబంధానికి కాస్త డివోషనల్ టచ్ ఇచ్చి ట్విస్ట్ లతో తెరకెక్కించారు ఈ సినిమాని. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరో హర్ష మాట్లాడుతూ.. ఈ సినిమా ఇంత హిట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. మా సినిమాని పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమా చూడని వారుంటే ఖచ్చితంగా వెళ్లి చూడండి అని అన్నారు.

lyf movie

డైరెక్టర్ పవన్ కేతరాజు మాట్లాడుతూ.. సినిమా చాలా బాగుందని చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఇంత చిన్న సినిమాని ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. చాలా మంది ఫోన్లు చేసి తమకు ఈ సినిమా చూశాక వాళ్ళ తండ్రి గుర్తొస్తున్నారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ అదిరిపోయిందని అంటున్నారు అని తెలిపారు. నిర్మాత కిషోర్ రాఠి మాట్లాడుతూ.. సినిమా బాగుందని చూసినవారు అంటున్నారు. మనీషా ఆర్ట్స్ బ్యానర్ లో గత నలభై ఏళ్లుగా ఇలాంటి కుటుంబ కథ చిత్రాలే తీస్తున్నాం. ఈ సినిమా కూడా మంచి ఆదరణ పొందింది అని అన్నారు.