జొన్నవిత్తుల సంచలన ప్రకటన: ఆర్‌జీవీపై ‘పప్పు వర్మ’ బయోపిక్ తీస్తా

దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద రచయిత జొన్నవిత్తుల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దిక్కుమాలిన ఆలోచనలతో సినిమాలు తీసి కాంట్రవర్సీ సృష్టిస్తూ రామ్ గోపాల్ వర్మ దారుణంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.
10టీవీ చర్చా కార్యక్రమంలో తనకు వర్మ ‘జొన్నవిత్తుల చౌదరి’ అని బిరుదు ఇచ్చాడు అని, నేను వర్మకి “పప్పు వర్మ” అనే బిరుదు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. చాగంటి గారి మీద ప్రేలాపణలు చేస్తూ నేనే మేధావి అని ఆనుకుంటున్నాడని, వర్మ వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం ఉండదు పైగా ఎంతో ప్రమాదకారి అని జొన్నవిత్తుల అన్నారు.
రామ్ గోపాల్ వర్మ బరితెగించినవాడు బతికున్న శవం లాంటి వాడు అంటూ తీవ్రస్థాయిలో తిట్టిపోశారు. రామ్ గోపాల్ వర్మ ఫిలాసఫీ పైన నేను పప్పువర్మ అనే బయోపిక్ తీస్తానంటూ చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ దిక్కుమాలిన ఆలోచనలు వలన సమాజంలో కలిగే దుష్పరిణామాలను తొలగించే ప్రయత్నమే పప్పువర్మ సినిమా అవుతుందని అన్నారు.