M4M Movie : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘M4M’ మూవీ స్క్రీనింగ్..

ఈ సినిమా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీనింగ్ జరగనుంది.

M4M Movie : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘M4M’ మూవీ స్క్రీనింగ్..

M4M Movie will Screening in Cannes Film Festival

Updated On : May 12, 2025 / 6:51 PM IST

M4M Movie : నిర్మాత మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా ‘M4M’ (Motive for Murder). ఈ సినిమా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీనింగ్ జరగనుంది. మే 17న సాయంత్రం 6 గంటలకు కేన్స్‌లోని PALAIS – C థియేటర్‌లో M4M ప్రైవేట్ స్క్రీనింగ్ జరగనుంది. ఈ సినిమాలో ఇండో అమెరికన్ నటి జో శర్మ మెయిన్ లీడ్ లో నటించింది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసారు. సినిమా రిలీజ్ కి ముందే పలు ఫిలిం ఫెస్టివల్స్ లో పాల్గొని అవార్డులు, రివార్డులు అందుకుంది. ఇటీవల జో శర్మ వేవ్స్ సమ్మిట్ లో కూడా పాల్గొంది. ఈ సందర్భంగా M4M టీమ్ ముంబయిలోని IMPPA ప్రివ్యూ థియేటర్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది.

Also Read : Sivaji Raja : అందుకోసం నక్సలైట్ అవుదామనుకున్నాడట.. లైసెన్స్ గన్ కూడా మెయింటైన్ చేస్తున్న శివాజీరాజా..

ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. మా సినిమాను కేన్స్‌లో ప్రదర్శించడమన్నది ఒక గొప్ప అవకాశం. అందుకు చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నాం అని తెలిపారు.

‘M4M’ సినిమా మర్డర్ మిస్టరీతో థ్రిల్లర్‌ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమాలో హంతకుడెవరో ఊహించిన వారికి 1000 డాలర్లు లేదా ఒక లక్ష రూపాయల బహుమతి ఇవ్వనున్నట్టు గతంలో చిత్రబృందం ప్రకటించింది. గతంలో మల్లెపువ్వు, మెంటల్ కృష్ణ, కలవరమాయే మదిలో.. లాంటి సినిమాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల ఈ M4M సినిమాతో దర్శకుడిగా మారారు.

Also Read : Pawan Kalyan : OG షూటింగ్ మొదలుపెట్టిన పవన్.. ఫ్యాన్స్ గెట్ రెడీ..