MAA Elections 2021 : శివబాలాజి చెయ్యి కొరికిన హేమ.. ‘మా’ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత

కొంతమంది హేమకి సంబంధించిన మనుషులు లోపల ప్రచారం చేస్తుండటంతో శివబాలాజీ వాళ్ళని బయటకి పంపిస్తుండగా హేమ శివబాలాజీని వెనక నుంచి చెయ్యి వద్ద కొరికింది. హేమ కొంచెం గట్టిగానే

MAA Elections 2021 : శివబాలాజి చెయ్యి కొరికిన హేమ.. ‘మా’ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత

Hema

Updated On : October 10, 2021 / 12:41 PM IST

MAA Elections 2021 : మొన్నటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా గొడవలకి దిగుతున్నారు. ఇవాళ ఉదయం ప్రారంభమైన ‘మా’ ఎన్నికలు కొద్ది సేపు ప్రశాంతంగా జరిగాయి. తాజాగా ఇప్పుడు ఇరు ప్యానళ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రచారం విషయంలో రెండు ప్యానెళ్ల మధ్య గొడవలు జరిగాయి. ముందు శివబాలాజీ, సమీర్ ల మధ్య గొడవ జరగడం తర్వాత ప్రకాష్ రాజ్, నరేష్ మధ్య వాగ్వాదం.. ఇలా ‘మా’ ఎలక్షన్స్ రసవత్తరంగా గొడవలతో సాగుతున్నాయి.

Posani : ఎట్టకేలకు బయటకి వచ్చిన పోసాని

కొంతమంది హేమకి సంబంధించిన మనుషులు లోపల ప్రచారం చేస్తుండటంతో శివబాలాజీ వాళ్ళని బయటకి పంపిస్తుండగా హేమ శివబాలాజీని వెనక నుంచి చెయ్యి వద్ద కొరికింది. హేమ కొంచెం గట్టిగానే శివబాలాజీ చెయ్యిని కొరికింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నరేష్ శివ బాలాజీని మీడియా వద్దకి తీసుకువచ్చి శివబాలాజి చెయ్యి చూపించి వాళ్ళ ప్యానల్ వాళ్ళు ఇలా చేస్తున్నారని అన్నారు. శివబాలాజీ కూడా మీడియాతో చెప్పాడు. ఎందుకు కొరికిందో కూడా తెలీదు అన్నాడు. హేమని మీడియా ఎందుకు కొరికారు అని అడగడంతో శివ బాలాజీని అడగండి అని అంది.