Madonna Sebastian: అందులో తప్పేముంది.. అసభ్యత, గ్లామర్ షో ఒకటి కాదు.. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు..

మలయాళ బ్యూటీ మడోనా సెబాస్టియన్ గురించి చాలా మందికి పరిచయం అవసరం లేదు. (Madonna Sebastian)ఈ అమ్మడు ఎక్కువగా మలయాళ, తమిళ సినిమాల్లో కనిపించింది.

Madonna Sebastian: అందులో తప్పేముంది.. అసభ్యత, గ్లామర్ షో ఒకటి కాదు.. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు..

Madonna Sebastian made interesting comments on the glamour show

Updated On : October 26, 2025 / 7:48 AM IST

Madonna Sebastian: మలయాళ బ్యూటీ మడోనా సెబాస్టియన్ గురించి చాలా మందికి పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఎక్కువగా మలయాళ, తమిళ సినిమాల్లో కనిపించింది. కానీ, మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమమ్ సినిమా చూసిన వారు మాత్రం మడోనాను అంత ఈజీగా (Madonna Sebastian)మర్చిపోలేరు. ఇక ఈ మలయాళ బ్యూటీ తెలుగులో కూడా రెండు సినిమాల్లో నటించింది. వాటిలో ఒకటి ప్రేమమ్ రీమేక్ కాదా రెండవది నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్. ఈ రెండు సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని సైతం మెప్పించింది కానీ, అవకాశాలు మాత్రం దక్కిచుకోలేకపోయింది.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ లో డబుల్ ట్విస్ట్.. ఎలిమినేట్ అయిన పచ్చళ్ళ పాప.. శ్రీజ రీ ఎంట్రీ ఫిక్స్?

ఇక మడోనా సెబాస్టియన్ గ్లామర్ షోకి దూరంగా ఉంటుంది. చేసిన తక్కువ సినిమాలే అయినా ఎక్కువ స్కిన్ షో మాత్రం చేయలేదు. కానీ, ఇటీవల ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో చూసి ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పొట్టి బట్టలు వేసుకొని స్కిన్ షో చేస్తూ గ్లామర్ తో రచ్చ చేసింది. ఇదేంటి మడోనా ఇలా చేస్తోంది అంటూ ఆమె ఫ్యాన్స్ అవాక్కయ్యారు. కొంతమంది సోషల్ మీడియాలో ఆమెను ట్యాగ్ చేస్తూ చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ మడోనా వరకు చేరడంతో ఆమె కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది.

ఈమేరకు మడోనా సోషల్ మీడియాలో స్పందిస్తూ..”గ్లామర్‌ షో తెప్పం కాదు. కానీ, గ్లామర్ కి అసభ్యతకు మధ్య వ్యత్యాసం తెలిస్తే చాలు. అది నాకు తెలుసు. నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలుసు”అంటూ కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి ఈ ఒక్క పోస్ట్ తో తాను కూడా గ్లామర్ షో కి సిద్ధం అంటూ సిగ్నల్ ఇచ్చేసింది మడోనా. మరి ఇకనైనా ఆమెకు వరుస అవకాశాలు వస్తాయా అనేది చూడాలి.