మే 18న విజయవాడలో విజయోత్సవం
మే 18వ తేదీన విజయవాడలో విజయోత్సవ సభ నిర్వహించనున్నారు మహర్షి చిత్ర నిర్మాతలు..

మే 18వ తేదీన విజయవాడలో విజయోత్సవ సభ నిర్వహించనున్నారు మహర్షి చిత్ర నిర్మాతలు..
సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, అశ్వినీదత్, దిల్ రాజు, పివిపి కలిసి నిర్మించిన మహర్షి, మే 9న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్లు సాధిస్తుందీ సినిమా. ఫ్రెండ్ షిప్, రైతుల సమస్యలు వంటి అంశాలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు.
ప్రీ-రీలీజ్ ఈవెంట్‌లో, సుదర్శన్ థియేటర్‌లో మహేష్ రెండుసార్లు కాలర్ ఎగరెయ్యడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యిందీ సినిమా. యూఎస్‌లో 1.5 మిలియన్స్ క్రాస్ చేసి, 2 మిలియన్ క్లబ్‌కి చేరువలో ఉండడంతో మహర్షి టీమ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
సినిమాని ఆదరిస్తున్న అభిమానులను, ప్రేక్షకులను కలుసుకుని కృతజ్ఞతలు చెప్పడానికి, మే 18వ తేదీన విజయవాడలో విజయోత్సవ సభ నిర్వహించనున్నారు మహర్షి చిత్ర నిర్మాతలు. మహర్షి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
వాచ్, పాలపిట్ట సాంగ్..