Dhoni : హీరోగా మహేంద్ర సింగ్ ధోని.. అలాంటి కథ అయితే ధోని రెడీ అంటున్న సాక్షి..

తెలుగులో కూడా LGM సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించగా చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు. ఓ విలేఖరి ధోని నటిస్తాడా, ధోని హీరోగా చేసే అవకాశం ఉందా అని ప్రశ్నించగా ధోని భార్య సాక్షి ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

Dhoni : హీరోగా మహేంద్ర సింగ్ ధోని.. అలాంటి కథ అయితే ధోని రెడీ అంటున్న సాక్షి..

Mahendra Singh Dhoni will act if action entertainment story with message come said by dhoni wife sakshi

Updated On : July 26, 2023 / 11:23 AM IST

Mahendra Singh Dhoni  :  క్రికెట్ లో టీమిండియాని అత్యున్నత స్థాయికి చేర్చి, వరల్డ్ కప్ అందించి, కెప్టెన్ గా ఎన్నో విజయాలు అందించిన ధోని రిటైర్మెంట్ అనంతరం ఐపీఎల్ ఆడుతూనే తన సెకండ్ ఇన్నింగ్స్ ని సినిమాల్లో మొదలుపెట్టాడు. ధోని ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థని స్థాపించి ధోని సినిమాలు నిర్మిస్తున్నారు. నిర్మాతగా ధోని తన మొదటి సినిమా తమిళ్ లో నిర్మిస్తున్నారు.

హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా నదియా, యోగిబాబు ముఖ్య పాత్రల్లో LGM (లెట్స్ గెట్ మ్యారీడ్)అనే సినిమాని రమేష్ తమిళమని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ధోని భార్య సాక్షి సింగ్ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్నారు. LGM సినిమా జులై 28న రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయనున్నారు.

దీంతో తెలుగులో కూడా LGM సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించగా చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు. ఓ విలేఖరి ధోని నటిస్తాడా, ధోని హీరోగా చేసే అవకాశం ఉందా అని ప్రశ్నించగా ధోని భార్య సాక్షి ఆసక్తికర సమాధానం ఇచ్చింది. సాక్షి సింగ్ ధోని మాట్లాడుతూ.. ఒకవేళ ధోని హీరోగా సినిమా చేస్తే అది కేవలం యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తాం. అలాంటి కథలో మంచి కథ, మంచి మెసేజ్ ఉంటే కచ్చితంగా ధోని నటిస్తారు అని తెలిపింది. దీంతో ధోని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Samantha : ఆకాశం, నీరు, నేల.. మధ్యలో సమంత.. బాలిలో సమంత ఎంజయ్ మోడ్..

ఇన్నాళ్లు గ్రౌండ్ లో తన బ్యాట్ తో అలరించిన ధోని త్వరలో వెండితెరపై కూడా అలరిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. మరి ధోనిని హీరోగా ఏ డైరెక్టర్ చూపిస్తాడో చూడాలి.