‘సర్కారు వారి పాట’లో మహేశ్ బాబు సరసన కీర్తి సురేష్

  • Published By: bheemraj ,Published On : June 19, 2020 / 12:42 AM IST
‘సర్కారు వారి పాట’లో మహేశ్ బాబు సరసన కీర్తి సురేష్

Updated On : June 19, 2020 / 12:42 AM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న చిత్రం సర్కారు వారి పాట. ఇటీవలే కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో మహేశ్ బాబు మాస్ లుక్ లో ఆకట్టుకున్నారు. చెవిపోగుతో మెడపై రూపాయి టాటూతో కనిపించారు. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన హీరోయిన్ కీర్తి సురేష్ నటించనున్నారు. తాజాగా ఇన్ స్టా లైవ్ లో అభిమానులతో ముచ్చటించిన ఆమె ఈ విషయాన్ని చెప్పారు. కీర్తి సురేష్ మహానటి సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. 

మహేశ్ బాబు మెడపై రూపాయి టాటూ వెనుక ఆసక్తికర కథ సోషల్ మీడియాలో, టాలీవుడ్ లో వైరల్ అవుతోంది. పరుశురామ్ ఈ కథను మొదటగా అమెరికా నేపథ్యంలో రాసుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడకు వెళ్లి షూటింగ్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో ఆ నేపథ్యాన్ని ఇండియాకు మార్చారని టాక్ వినిపిస్తోంది. 

దీంతో డాలర్ సింబల్ తో మెడపై టాటూ వేయాల్సి ఉండగా, దాన్ని రూపాయి టాటూగా మార్చారట. అలాగే మహేష్ బాబు చెవికి ఉన్న పోగు రఫ్ లుక్ చూస్తుంటే ఇందులో ఆయన పాత్రకు పోకిరి సినిమాలోని పాత్ర లక్షణాలుంటాయని అంటున్నారు. 

Read: నిహారిక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలుసా?