Mahesh Babu : మహేష్ @1057 గుండెల చప్పుడు..

మహేష్ మంచి మనసు.. నెల వయసున్న చిన్నారికి విజయవంతంగా సర్జరీ..

Mahesh Babu : మహేష్ @1057 గుండెల చప్పుడు..

Mahesh

Updated On : January 13, 2022 / 5:41 PM IST

Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇటీవలే కోవిడ్ బారినపడ్డారు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉండగా ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రస్తుత పరిస్థుతుల నేపథ్యంలో అన్నయ్యను చివరి చూపు కూడా చూసుకోలేకపోయారు మహేష్.

Mahesh Babu : మహేష్‌బాబుకు మోకాలి సర్జరీ

ఇదిలా ఉంటే.. మహేష్ ఎప్పటినుండో పలు సేవా కార్యక్రమాల ద్వారా రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్న సంగతి తెలిసిందే. తన సేవాభావంతో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. గుండె ఆపరేషన్లు చేయించి వేలాది మంది చిన్నారులకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు మహేష్. అలాగే రెండు గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

Unstoppable with NBK: బాలయ్య టాక్ షో.. మహేష్‌తో లాస్ట్ ఎపిసోడ్

రీసెంట్‌గా మహేష్ ద్వారా మరో చిన్నారికి ప్రాణదానం చేశారు. ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. జాంబవంతుల శిరీష అనే మహిళకు జన్మించిన 1 నెల వయసున్న చిన్నారికి ఆంధ్ర హాస్పిటల్ వారి సాయంతో సక్సెస్‌ఫుల్‌గా సర్జరీ జరిపించి, పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి చేశామని నమ్రత తెలిపారు. దీంతో మహేష్ హార్ట్ సర్జరీలు చేయించిన చిన్నారుల సంఖ్య 1057కు చేరింది.

Namrata