Sarkaru Vaari Paata : మెగా బ్రదర్స్ మహేష్‌ని బీట్ చెయ్యలేదంట..!
సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ బర్త్‌డే బ్లాస్టర్ వీడియో నయా రికార్డ్ క్రియేట్ చేసింది..

Mahesh Babu Creates Twitter Space Record
Sarkaru Vaari Paata: ‘భీం భీం భీం భీమ్లా నాయక్.. బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్’.. నిన్నటినుంచి మీడియా, సోషల్ మీడియాలో మార్మోగిపోతుందీ పాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ రిలీజ్ చెయ్యగా.. టాలీవుడ్లో అతి తక్కువ టైం లో యూట్యూబ్‌లో హైయ్యస్ట్ వ్యూస్, లైక్స్ తెచ్చుకున్న లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సెట్ చేసింది.
Bheemla Nayak Fans Reaction : థమన్ అన్నా.. ఏం తాగి కొట్టావన్నా మ్యూజిక్..!
అయితే ట్విట్టర్ స్పేస్‌లో మాత్రం పవన్ సాంగ్ కంటే అన్నయ్య ‘ఆచార్య’ టీజర్ ముందుందని, వీళ్లిద్దరి కంటే మహేష్ బాబు మూవీ టాప్‌లో ఉంది అంటున్నారు అభిమానులు.. ఈమధ్య కొత్తగా ట్విట్టర్ స్పేస్‌లోనే ఎక్కువగా ఫ్యాన్ మీటింగ్స్, హీరోల గురించి వాళ్ల సినిమాల గురించి డిస్కషన్స్ పనిలో పనిగా ఫ్యాన్ వార్స్ వంటివి జరుగుతున్నాయి. పవన్ ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ గురించి టాపిక్ నడిచింది. అయితే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ బర్త్‌డే బ్లాస్టర్ వీడియో రికార్డ్‌ని మెగా బ్రదర్స్ సినిమాలు బీట్ చెయ్యలేకపోయాయని కన్ఫమ్ చేశారు.
Bheemla Nayak : ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ పాడింది ఎవరో తెలుసా..?
ట్విట్టర్ స్పేస్‌లో సూపర్ స్టార్ రికార్డ్ క్రియేట్ చేశాడని అంటున్నారు. ఏ హీరో సినిమాని ఎంతమంది లిజనర్స విన్నారనే ట్విట్టర్ స్పేస్ లిజనర్స్ లిస్ట్ ఇలా ఉంది.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ టీజర్ 4.6 K, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ 4 K, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ బర్త్‌డే బ్లాస్టర్ టీజర్ 14.9 K మంది విన్నారట. అదీ సంగతి..