Guntur Kaaram : గుంటూరు కారం సెట్స్ నుంచి మహేష్ బాబు డాన్స్ వీడియో లీక్..

గుంటూరు కారం మూవీ సెట్స్ నుంచి మహేష్ బాబు డాన్స్ వీడియో లీక్ అయ్యింది. ఆ వీడియోలో మహేష్ డాన్స్..

Mahesh Babu dance video leak from Guntur Kaaram movie sets

Guntur Kaaram : మహేష్ బాబు ఇప్పటివరకు కనిపించినంత మాస్ రోల్ లో కనిపిస్తూ చేస్తున్న మాస్ మసాలా చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతి రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక రిలీజ్ కి రెండు నెలలు సమయం మాత్రమే ఉండడంతో మూవీ టీం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటూ ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కోటి ఉమెన్స్ కాలేజ్ లో జరుగుతుంది. డిసెంబర్ 20 వరకు నాన్ స్టాప్ గా ఈ చిత్రీకరణ జరగనుంది. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి ఒక డాన్స్ వీడియో లీక్ అయ్యింది.

ఆ వీడియోలో మహేష్ బాబు డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. అయితే ఆ వీడియో ఇప్పుడు షెడ్యూల్ కి సంబంధించింది కాదని తెలుస్తుంది. గత షెడ్యూల్ లో రామోజీ ఫిలిం సిటీలో ‘దమ్ మసాలా’ సాంగ్ చిత్రీకరిస్తున్న సమయంలోని వీడియో అని అర్ధమవుతుంది. నడి రోడ్డు పై డాన్స్ అసిస్టెంట్స్ స్టెప్పులు వేసి చూపిస్తుంటే.. వాటిని మహేష్ బాబు ప్రాక్టీస్ అవుతూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి మహేష్ బాబు డాన్స్ వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.

Also read : Nandu : గల్లీ క్రికెట్ నుంచి వరల్డ్ కప్ వరకు ప్రయాణం.. యాక్టర్ నందు ఎమోషనల్ పోస్ట్..

మొదటి సాంగ్ ‘దమ్ మసాలా’ మాస్ ని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత నాగవంశీ తెలియజేశారు. సెకండ్ సాంగ్ ని వచ్చే వారం రిలీజ్ చేయబోతున్నట్లు, సినిమాలో మొత్తం నాలుగు సాంగ్స్ ఉన్నాయని, మిగిలిన సాంగ్స్ కూడా ఎంతో బాగా వచ్చాయని, ఆ సాంగ్స్ ని త్వరలోనే ఒక్కొక్కటిగా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేస్తామని వెల్లడించారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి మహేష్ బాబుకి జోడిగా నటిస్తున్నారు.