Rajamouli : రాజమౌళి మొన్న డ్యాన్సులు, ఇవాళ యాడ్స్.. మా సంగతేంటి బాబు అంటున్న మహేష్ బాబు ఫ్యాన్స్..

ఇవాళ రాజమౌళి డేవిడ్ వార్నర్ యాడ్ వైరల్ అవ్వడంతో మహేష్ అభిమానులు..

Rajamouli : రాజమౌళి మొన్న డ్యాన్సులు, ఇవాళ యాడ్స్.. మా సంగతేంటి బాబు అంటున్న మహేష్ బాబు ఫ్యాన్స్..

Mahesh Babu fans Funny Trolls on Rajamouli about SSMB 29 Movie

Updated On : April 12, 2024 / 6:24 PM IST

Rajamouli – Mahesh Babu : రాజమౌళి RRR సినిమా తర్వాత చాలానే గ్యాప్ తీసుకున్నాడు. RRR ని ఆస్కార్ వరకు తీసుకెళ్లి అవార్డు కూడా సాధించి వచ్చాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా గురించి ఎవరెవరో మాట్లాడటం తప్ప ఇప్పటివరకు రాజమౌళి నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. రాజమౌళి – మహేష్ సినిమా స్క్రిప్టు వర్క్ పూర్తయిందని, మ్యూజిక్ వర్క్ మొదలైందని పలువురు మాట్లాడినా రాజమౌళి మాత్రం అస్సలు మాట్లాడట్లేదు ఈ సినిమా గురించి.

అయితే గత కొన్ని రోజులుగా రాజమౌళి వైరల్ అవుతున్నారు. రాజమౌళితో సినిమా అంటే ఏళ్ళు పడుతుంది. అందుకే మహేష్ ఫ్యాన్స్ రాజమౌళి పైనే భారం వేసి త్వరగా సినిమా తీయాలని కోరుకుంటున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఫ్యామిలీతో ట్రిప్పులు, డ్యాన్సులు, తాజాగా డేవిడ్ వార్నర్ తో యాడ్స్.. ఇవన్నీ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ మహేష్ సినిమా వర్క్ చేస్తున్నా అది బయటకి కనపడకపోవడంతో మహేష్ అభిమానులు రాజమౌళిని ఆడేసుకుంటున్నారు.

Also Read : Family Star : ఫ్యామిలీ స్టార్ సినిమాలో డిలిటెడ్ సీన్ చూశారా? ఫ్లైట్‌లో అన్ని బ్రాండ్స్ మందు కలిపి విజయ్ ఏం చేసాడంటే..

ఇవాళ రాజమౌళి డేవిడ్ వార్నర్ యాడ్ వైరల్ అవ్వడంతో మహేష్ అభిమానులు.. అసలు మహేష్ బాబుతో సినిమా ఉందా? అసలు మహేష్ సినిమా వర్క్ జరుగుతుందా? ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు? సినిమా లేదని ప్రాంక్ చేయరుగా? మా ఫ్యాన్స్ మనోభావాలతో ఆడుకోకండి అంటూ సరదాగా సోషల్ మీడియాలో మీమ్స్ వేస్తున్నారు. ఇప్పటికైనా మహేష్ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి, మహేష్ సినిమా మొదలుపెట్టండి అని అభిమానులు కోరుకుంటున్నారు. రాజమౌళి ఎంజాయ్ చేస్తుంటే మహేష్ సినిమా ఇంకా లేట్ అయిపోతుందని అభిమానులు బాధపడుతున్నారు.