Guntur Kaaram : గుంటూరు కారం ‘దమ్ మసాలా’ సాంగ్ వచ్చేసింది..
మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' మొదటి సింగల్ దమ్ మసాలా’ సాంగ్ వచ్చేసింది.

Mahesh Babu Guntur Kaaram Movie Dum Masala Song Released
Guntur Kaaram : త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మొదటి పాట రిలీజ్ అదుగో ఇదుగో అంటూ మొన్నటి వరకు కాలం నెట్టుకొచ్చిన మేకర్స్.. ఎట్టకేలకు సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేశారు. నేడు దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని మొదటి సాంగ్ ‘దమ్ మసాలా’ పాటని రిలీజ్ చేశారు.
థమన్ సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించాడు. సంజిత్ హెగ్డే, థమన్ పాటని పాడారు. ఇక ఈ లిరికల్ వీడియో సాంగ్ లో ఆల్రెడీ రిలీజ్ చేసిన పోస్టర్ స్టిల్స్ అండ్ గ్లింప్స్ విజువల్స్ తో పాటు కొత్తగా ఒకటి రెండు సీన్స్ ని చూపించారు. సాంగ్ అంత చూసిన తరువాత అర్థమైంది ఏంటంటే.. మహేష్ ఇప్పటివరకు కనిపించనంత మాస్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడని మాత్రం అర్ధమవుతుంది. మహేష్ అభిమానులకు ఈ సినిమా థియేటర్ లో పూనకాలు తెప్పించడం ఖాయం అన్నట్లు ఉంది.
Also read : Zara Patel : రష్మిక మార్ఫింగ్ వీడియోలో ఉన్న జారా పటేల్ ఎవరు?.. వీడియోపై ఆమె స్పందన ఏంటంటే?
కాగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, సునీల్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2024 జనవరి 12న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఖలేజా, అతడు ప్రజాధారణ పొందినప్పటికీ కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వలేదు. మరి ఈ కాంబినేషన్ ఈసారి ఏం చేస్తారో చూడాలి.